ViralVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/teacher-saved-elephants4e1f1cfa-5580-46cc-8fee-913c062cc64b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/teacher-saved-elephants4e1f1cfa-5580-46cc-8fee-913c062cc64b-415x250-IndiaHerald.jpgమానవాళికి అడవులు ఎంత ముఖ్యమో అదే విధంగా అడవికి జంతుజాలం అంతే ముఖ్యం. ప్రధానంగా అరణ్యాలకు ఏనుగులు చాలా ముఖ్యం. అడవులు పెరగడానికి ఒక రకంగా ఏనుగులే కారణం. అటువంటి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అంటుంటారు. ఈ అంశంపై ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు, సేవకులు ఎన్నో ఏళ్లుగా వన్యప్రాణి సంరక్షకులుగా జంతువుల రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.TEACHER-SAVED-ELEPHANTS{#}Champion;Gharshana;School;India;prakrutiఏనుగుల పాలిట దేవుడు... ఈ స్కూల్ టీచర్ఏనుగుల పాలిట దేవుడు... ఈ స్కూల్ టీచర్TEACHER-SAVED-ELEPHANTS{#}Champion;Gharshana;School;India;prakrutiThu, 19 Aug 2021 19:49:44 GMTమానవాళికి అడవులు ఎంత ముఖ్యమో అదే విధంగా అడవికి జంతుజాలం అంతే ముఖ్యం. ప్రధానంగా అరణ్యాలకు ఏనుగులు చాలా ముఖ్యం. అడవులు పెరగడానికి ఒక రకంగా ఏనుగులే కారణం. అటువంటి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అంటుంటారు. ఈ అంశంపై ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు, సేవకులు ఎన్నో ఏళ్లుగా వన్యప్రాణి సంరక్షకులుగా జంతువుల రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇపుడు అలాంటి వారిలో ఒకరిగా చేరారు పశ్చిమ బెంగాల్‌కు చెందినటువంటి ఎస్పీ పాండే అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ఏనుగులను ఎంతగానో ప్రేమించే ఈయన ప్రతి సంవత్సరం వివిధ కారణాలతో సగటున ఏడు ఏనుగుల వరకు మరణిస్తున్నాయి అన్న వాస్తవాన్ని తెలుసుకొని చాలా కలత చెందారు.

పరోక్షంగానూ , ప్రత్యక్షంగానూ మానవుల వలన ఎన్నో  ఏనుగులు చనిపోతున్నాయి. కొందరు ఏనుగులు  తిరిగే ప్రదేశాలలో హైపవర్ కరెంట్ తీగలు అమర్చి వాటి మరణానికి కారణం అవుతున్నారు. ఇంకొందరు ఏనుగుల దంతాల కొరకు వేటాడి మరి చంపుతున్నారు. అయితే ఇటువంటి వాటిని అడ్డుకుని ఏనుగులను రక్షించేందుకు నడుం బిగించారు ఎస్పీ పాండే. ప్రజల్లో ఏనుగుల ప్రాముఖ్యతను గుర్తించి అవగాహన పెంచి వాటిని రక్షించాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం ఏనుగులు ఎక్కువగా సంచరించే ఐదు కారిడార్లలో ఏనుగులకు మరియు మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి తనవంతు ప్రయత్నం మొదలు పెట్టారు.  

43ఏళ్ల ఎస్పీ పాండే ఏనుగుల కోసం చేస్తున్న కృషికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటిఐ) పాండేను ఆయన సేవలకు గాను గ్రీన్ కారిడార్ ఛాంపియన్ టైటిల్‌తో సత్కరించి అభినందించింది. ఇది ఎప్పుడూ అంతర్జాలంలో బాగా వైరల్ అవుతోంది. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని మరి కొందరు ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.



మొహమాటం తో ఇరకాటంలో పెడుతున్నారు ..... ??

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>