PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccine-pffer-forieghners-51048944-2a83-4f83-b0dc-7d4217c1d648-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccine-pffer-forieghners-51048944-2a83-4f83-b0dc-7d4217c1d648-415x250-IndiaHerald.jpgభారత్ లో చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లల కోసం సెప్టెంబర్ నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోవాగ్జిన్ సెకండ్ ఫేజ్, పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని... థర్డ్ ఫేజ్ ఫరీక్షలు కూడా 2 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య పిల్లలపై నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణె డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. వీటి ఫలిVaccine{#}Russia;Drugs;V;Doctor;Indian;Application;Director;september;Good news;Good Newwz;Indiaసెప్టెంబర్ నుంచి వారికి కూడా వ్యాక్సిన్సెప్టెంబర్ నుంచి వారికి కూడా వ్యాక్సిన్Vaccine{#}Russia;Drugs;V;Doctor;Indian;Application;Director;september;Good news;Good Newwz;IndiaWed, 18 Aug 2021 19:47:00 GMTభారత్ లో చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లల కోసం సెప్టెంబర్ నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోవాగ్జిన్ సెకండ్ ఫేజ్, పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని... థర్డ్ ఫేజ్ ఫరీక్షలు కూడా 2 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య పిల్లలపై నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణె డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. వీటి ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు డాక్టర్ ప్రియా. సెప్టెంబర్ నెల నుంచే పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్ సహకారంతో కలిసి మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కోసం మొత్తం మూడు టీకాలను కేంద్రం అందిస్తోంది. కొవాగ్జిన్ తో పాటు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కోవిషీల్డ్, రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జనవరి నెలలో అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ టీకాను ఆమోదించింది. జైడస్ కాడిలా సంస్థ తయారు చేసిన జైకోవ్-డి పెట్టుకున్న దరఖాస్తు ఇప్పటికీ డీజీసీఐ దగ్గర ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. జైడస్ కాడిలా వ్యాక్సిన్ కూడా చిన్న పిల్లలపై ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసుకుంది. బూస్టర్ డోస్ పై ఇప్పటికే విదేశాల్లో పరీక్షలు పూర్తయ్యాయన్ని డాక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. అయితే పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాత్కాలిక బ్రేక్ వేసిన విషయాన్ని డాక్టర్ ప్రియా గుర్తు చేశారు. పేద దేశాలకు ధనిక దేశాలు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ లో సాయం చేయాలని కూడా డబ్ల్యూ.హెచ్.ఓ. ఆదేశించినట్లు వెల్లడించారు. ఇప్పటికే రెండు డోసులను కూడా వేరు వేరు వ్యాక్సిన్ లు వేయించుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.





మీట‌ర్ అండ్ మేట‌ర్ : హ‌రీశ్ వ‌ద్ద‌న్నాడు ? సాయిరెడ్డి ఔన‌న్నాడు?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>