MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/blockbuster-hit-messy-in-that-regard-67190477-fdfa-4f9d-9e8e-0844f80811c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/blockbuster-hit-messy-in-that-regard-67190477-fdfa-4f9d-9e8e-0844f80811c6-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ విజయాలవైపే చూస్తుంది. ఎవరు సూపర్ హిట్స్‌లో ఉంటే వాళ్లవైపే పరుగులు పెడతారు. కానీ కొంతమంది దర్శకులకు మాత్రం విజయం సాధించిన తర్వాత కూడా తడబడుతున్నారు. సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినా తర్వాతి సినిమాలు తీసే విషయంలో తర్జనభర్జనపడుతున్నారు. Blockbuster hit messy in that regard!{#}Joseph Vijay;Venky Kudumula;Allari;Tarun Kumar;Romantic;Darsakudu;Director;Coronavirus;ram pothineni;Shiva;lord siva;Cinema;Successబ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ విషయంలో గజిబిజి !బ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ విషయంలో గజిబిజి !Blockbuster hit messy in that regard!{#}Joseph Vijay;Venky Kudumula;Allari;Tarun Kumar;Romantic;Darsakudu;Director;Coronavirus;ram pothineni;Shiva;lord siva;Cinema;SuccessWed, 18 Aug 2021 12:30:00 GMTనవీన్‌ పోలిశెట్టికి 'జాతిరత్నాలు' సినిమాతో ఎంత పేరు వచ్చిందో, డైరెక్టర్ అనుదీప్‌ కూడా అంతే పాపులర్ అయ్యాడు. ఈ మూవీ 50 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అయితే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న అనుదీప్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంకా క్లారిటీ రాట్లేదు. ఆ మధ్య శివ కార్తికేయన్‌తో బైలింగ్వల్ చేస్తాడనే ప్రచారం జరిగింది గానీ ఇంకా సినిమా లాంచ్ కాలేదు. కరోనా ఫస్ట్ లాక్‌డౌన్‌ తర్వాత బిగ్గెస్ట్ రొమాంటిక్ హిట్‌గా నిలిచిన సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సక్సెస్‌తో బుచ్చిబాబు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కానీ ఈ బ్లాక్‌బస్టర్‌ తర్వాత మరో సినిమా అనౌన్స్‌ చెయ్యలేదు బుచ్చిబాబు. జూ.ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందనే టాక్ వచ్చినా ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడానికి మరింత టైమ్ పట్టే అవకాశముందట.

వెంకీ కుడుముల రెండు సినిమాలు చేస్తే, రెండిటికి సక్సెస్ టాక్ వచ్చింది. 'ఛలో, భీష్మ' సినిమాలతో యూత్‌, ఫ్యామిలీస్‌ ఇద్దరినీ కవర్‌ చేశాడు. అయితే సక్సెస్ రేట్‌లో ముందున్నా ఈ డైరెక్టర్‌ ఇంకా నెక్ట్స్ సినిమా మాత్రం కన్ఫర్మ్ చెయ్యలేదు. రామ్ చరణ్‌తో సినిమా అని కొన్నాళ్లు, రామ్‌తో ఉంటుందని మరికొన్నాళ్లు ప్రచారం జరిగినా ప్రాజెక్ట్‌ మాత్రం ఫిక్స్‌ కాలేదు.

అల్లరి నరేశ్‌ని చాలా రోజుల తర్వాత సక్సెస్‌ ట్రాక్ ఎక్కిచ్చిన సినిమా 'నాంది'. సెక్షన్ 211 నేపథ్యంలో విజయ్ కనకమేడల రూపొందించిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సూపర్ హిట్‌ తర్వాత విజయ్ మరో మూవీ స్టార్ట్ చెయ్యలేదు. అల్లరి నరేశ్‌తోనే మళ్లీ సినిమా చేస్తాడని, హిందీలో 'నాంది' రీమేక్‌ చేస్తాడనే మాటలు వినిపిస్తున్నా, ఏ సినిమా ఫస్ట్ వస్తుందనే క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. 'పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యూత్‌ఫుల్‌ హిట్స్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్. యాక్టర్ కమ్‌ డైరెక్టర్‌గా రెండు పడవల ప్రయాణం చేస్తోన్న తరుణ్ భాస్కర్ మళ్లీ ఎప్పుడు మెగాఫోన్ పడతాడన్నది తెలియట్లేదు. వెంకటేశ్‌తో హార్స్‌ రేసింగ్ సినిమా తీస్తాడనే ప్రచారం జరుగుతున్నా లాంచింగ్‌ డేట్ ఫిక్స్ కాలేదు.





రైతుకూలీల‌తో వైఎస్ ష‌ర్మిల ముచ్చ‌ట్లు.. !

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>