PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh2ad16ace-8a06-4393-90e0-802566747e9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh2ad16ace-8a06-4393-90e0-802566747e9c-415x250-IndiaHerald.jpgరాజకీయాల ఒకేలా ఉండవని టిడిపి నేత నారా లోకేష్‌ని చూస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పొచ్చు. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్లు... ఎవరైతే గతంలో నారా లోకేష్‌ని పప్పు అని ఎగతాళి చేశారో, ఇప్పుడు వారే లోకేష్ లీడర్‌గా ఎదుగుతున్నాడని కాస్త కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అధికారంలో ఉండగా, లోకేష్‌పై వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో సెటైర్లు వేసేవారో అందరికీ తెలిసిందే. ఆయన మాటతీరుపై, బాడీ తీరుపై ఎగతాళి చేస్తూ వచ్చారు.lokesh{#}Lokesh;Lokesh Kanagaraj;Arrest;TDP;YCP;Traffic police;Hanu Raghavapudi;police;Party‘పప్పు’ని మరిచిపోయిన వైసీపీ...లోకేష్‌ని సెట్ చేశారా?‘పప్పు’ని మరిచిపోయిన వైసీపీ...లోకేష్‌ని సెట్ చేశారా?lokesh{#}Lokesh;Lokesh Kanagaraj;Arrest;TDP;YCP;Traffic police;Hanu Raghavapudi;police;PartyWed, 18 Aug 2021 08:22:00 GMTరాజకీయాల ఒకేలా ఉండవని టిడిపి నేత నారా లోకేష్‌ని చూస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పొచ్చు. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్లు... ఎవరైతే గతంలో నారా లోకేష్‌ని పప్పు అని ఎగతాళి చేశారో, ఇప్పుడు వారే లోకేష్ లీడర్‌గా ఎదుగుతున్నాడని కాస్త కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది. టిడిపి అధికారంలో ఉండగా, లోకేష్‌పై వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో సెటైర్లు వేసేవారో అందరికీ తెలిసిందే. ఆయన మాటతీరుపై, బాడీ తీరుపై ఎగతాళి చేస్తూ వచ్చారు.


లోకేష్ ఏం మాట్లాడిన ట్రోల్ చేస్తూ వచ్చారు. పప్పు పప్పు అంటూ లోకేష్‌ని ఎగతాళి చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా లోకేష్‌ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తూ వచ్చారు. మరి వైసీపీ నేతలు ఎగతాళి చేయడం వలనో లేదా తనతో పాటు సొంత పార్టీ కూడా దారుణంగా ఓడిపోయి కష్టాల్లో ఉండడం వలనో, ఏమో తెలియదు గానీ లోకేష్‌లో మాత్రం బాగా మార్పు వచ్చింది. ఊహించని విధంగా ఆయన మాట తీరు మారింది. బాడీ తీరు మారింది.


ఏ విషయన్నైనా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ, అధికార వైసీపీ పై విరుచుకుపడుతున్నారు. అటు ప్రజా సమస్యలపై కూడా పోరాడుతున్నారు. తాజాగా ఓ దుర్మార్గుడు చేతిలో హత్యకు గురైన రమ్యశ్రీ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించడానికి వెళ్ళిన తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు టీడీపీ శ్రేణులు కూడా రివర్స్‌లో నినాదాలు చేశాయి.


అయితే అక్కడ ఉన్న పోలీసులు వైసిపి నేతలను పట్టించుకోకుండా లోకేష్‌ని, ఇతర టిడిపి నేతలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు. దాదాపు ఏడు గంటల పాటు స్టేషన్స్ చుట్టూ తిప్పి లోకేష్‌ని విడుదల చేశారు. ఇప్పుడు ఇదే అంశం లోకేష్‌కు ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. మామూలుగా అలా వదిలేసి ఉంటే లోకేష్ పరామర్శించుకుని వెళ్ళిపోయేవారు.


కానీ వైసీపీ నేతలు హడావిడి చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల, ఇప్పుడు అనవసరంగా లోకేష్ హైలెట్ అయ్యారు. ఏదేమైనా లోకేష్‌ని

హైలెట్ చేయడంలో వైసీపీ నేతలు బాగా కష్ట పడినట్లు తెలుస్తుంది. ఆఖరికి వైసీపీ నేతలే పప్పు అని పిలవడం ఆగిపోయేలా లోకేష్ చేశారు.




శ్రీ‌శైలం: నేటినుంచి గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>