PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/kurnool-sugali-preethi-case-forgot7956637b-839a-4bd1-8477-481436b33343-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/kurnool-sugali-preethi-case-forgot7956637b-839a-4bd1-8477-481436b33343-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి బాయి కేసు నీరుగారుతోందా..? హత్యాచార ఘటన జరిగి ఐదేళ్లు అయినా.. ఇప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి అసలు కారణాలేమిటి? ఇంతకీ ఆ కేసు విచారణ ఏమైనట్టు? గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన రమ్యశ్రీ ఉదంతంతో.. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన యువతుల హత్య కేసుల్లో విచారణ ఎంతవరకు వచ్చిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ కోవలోనే ఐదేళ్ల క్రితం హత్యాచానికి గురైన సుగాలి ప్రీతి బాయి కేసులో పోలీసులు ఏం తేల్చారు? దర్యాప్తు ఏమైంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్kurnool Sugali preethi case forgot{#}prithy;Corporate;Kurnool;CBI;Parents;Janasena;Murder.;School;Letter;Jagan;police;Governmentసుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేశారా?సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేశారా?kurnool Sugali preethi case forgot{#}prithy;Corporate;Kurnool;CBI;Parents;Janasena;Murder.;School;Letter;Jagan;police;GovernmentWed, 18 Aug 2021 19:13:51 GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి బాయి కేసు నీరుగారుతోందా..? హత్యాచార ఘటన జరిగి ఐదేళ్లు అయినా.. ఇప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి అసలు కారణాలేమిటి? ఇంతకీ ఆ కేసు విచారణ ఏమైనట్టు? గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన రమ్యశ్రీ ఉదంతంతో.. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన యువతుల హత్య కేసుల్లో విచారణ ఎంతవరకు వచ్చిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ కోవలోనే ఐదేళ్ల క్రితం హత్యాచానికి గురైన సుగాలి ప్రీతి బాయి కేసులో పోలీసులు ఏం తేల్చారు? దర్యాప్తు ఏమైంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కర్నూలు శివారులోని  కట్టమంచి రామలింగారెడ్డి కార్పొరేట్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థి సుగాలి ప్రీతి ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హత్యాచారం వెనుక స్కూల్ యాజమాన్యం పాత్ర ఉందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వాపోయారు. అయితే నిందితులను కాపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గతేడాది కర్నూలులో జనసేన అధినేత పవన్ భారీ ర్యాలీ కూడా తీశారు. అయితే కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు జగన్ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది.

సీబీఐ విచారణ మొదలు కాకపోవడంతో..సుగాలి ప్రీతి బాయి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలతో కలిసి ఓసారి ఢిల్లీలో సీబీఐ ప్రతినిధులను కలిశారు. సీబీఐ విచారణపై జారీ చేసిన జీవోలలో  ప్రొసీజర్ ఫాలో కాలేదని.. ఆ జీవోలు వేస్ట్ పేపర్‌తో సమానమని అధికారులు చెప్పినట్టు ప్రీతిబాయి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గత నెల 17న.. దిశా ప్రత్యేక అధికారి కృతికా శుక్లాను కలిశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెన్ ఫిట్స్ అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కానీ కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు  చేయించాలని సీజేఐ ఎన్వీ రమణకు లేఖలు రాశారు. తమకు న్యాయం చేస్తామన్న జగన్.. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మొత్తంమీద ఐదేళ్లయినా సుగాలి ప్రీతి బాయి కేసులో పురోగతి లేకపోవడంపై దుమారం రేగుతోంది. దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు.



మీట‌ర్ అండ్ మేట‌ర్ : హ‌రీశ్ వ‌ద్ద‌న్నాడు ? సాయిరెడ్డి ఔన‌న్నాడు?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>