EditorialPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-f22b71dc-ff43-44cb-ad71-25ce3f59e198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-f22b71dc-ff43-44cb-ad71-25ce3f59e198-415x250-IndiaHerald.jpgఅంతా ఆన్ లైన్ అంటుంటే... ఏపీలో మాత్రం ఆఫ్ లైన్ విధానం అమలవుతోంది. ఇదేదో విద్యార్థులకు పాఠాలు బోధించే అంశం అనుకుంటున్నారా... ఏ మాత్రం కాదు. మరి ఆన్ లైన్.. ఆఫ్ లైన్.. అనే అంశం ఎందుకు ప్రస్తావన వచ్చిందనుకుంటున్నారు... ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఉత్తర్వులకు సంబంధించిన అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు... జీవోలను ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. పారదర్శక పాలనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఉత్తర్వులు, వాటి నAndhra Pradesh{#}Andhra Pradesh;Jagan;Government;central governmentఅంత దాపరికం ఎందుకో మరి..!అంత దాపరికం ఎందుకో మరి..!Andhra Pradesh{#}Andhra Pradesh;Jagan;Government;central governmentWed, 18 Aug 2021 06:59:24 GMTఅంతా ఆన్ లైన్ అంటుంటే... ఏపీలో మాత్రం ఆఫ్ లైన్ విధానం అమలవుతోంది. ఇదేదో విద్యార్థులకు పాఠాలు బోధించే అంశం అనుకుంటున్నారా... ఏ మాత్రం కాదు. మరి ఆన్ లైన్.. ఆఫ్ లైన్.. అనే అంశం ఎందుకు ప్రస్తావన వచ్చిందనుకుంటున్నారు... ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఉత్తర్వులకు సంబంధించిన అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు... జీవోలను ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. పారదర్శక పాలనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఉత్తర్వులు, వాటి నియమ నిబంధనలు కూడా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, పత్రికా ప్రతినిధులకు సులువుగా అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్ తోనే అన్ని జీవోలను ఆన్ లైన్ లో ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పూర్తి విరుద్ధఁగా వ్యవహరిస్తోంది. పారదర్శక పాలన అందిస్తామంటున్న ప్రభుత్వం,.. రహస్య జీవోలు జారీ చేయడంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం కూడా తీసుకుంది. అది ఏమిటంటే... ఇకపై ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోలు కూడా ఆన్ లైన్ లో ఉంచేది లేదని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడో 16 ఏళ్ల కింద అమలులో ఉన్న 2005 నాటి పాత విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో మాదిరి మూడు ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని... అసలు జీవోలు బయటకు తెలియాల్సిన అవసరం లేదని అధికారులు ఉద్యోగులను హెచ్చరించారు కూడా. ఆఫ్ లైన్ లో జీవోలు ఉండాలనే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు జీవోలు రహస్యంగా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.





శ్రీ‌శైలం: నేటినుంచి గ‌ర్భాల‌య ద‌ర్శ‌నం

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>