PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban5da6ecd0-c8ba-4d00-be26-c59700318214-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban5da6ecd0-c8ba-4d00-be26-c59700318214-415x250-IndiaHerald.jpgఅఫ్గాన్‌ ను అమెరికా సైన్యం విడిచి వెళ్లిన తర్వాత తాలిబన్లు చాలా వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. రాజధాని కాబూల్‌లో చొరబడ్డారు. అధికారాన్ని హస్త గతం చేసుకున్నారు. తాలిబన్ల దూకుడుతో ఆ దేశ అధ్యక్షుడే ప్రాణాలు చేతబట్టుకుని విదేశాలకు చెక్కేసారు. ఆ తర్వాత కాబూల్‌లో అడుగుపెట్టిన తాలిబన్ల మూకలు.. ఆ దేశ అధ్యక్ష భవనంలో ఇష్టారాజ్యంగా తిరిగిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు.. ఆ దేశ పార్లమెంట్ భవనంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వాళ్ల రాజ్యం.. వాళ్ల ఇష్టం మనకెందుకు అంటారా.. అదీ నిజమే కానీ.taliban{#}HOSTA;Capital;Parliment;Heart;Ishtam;Parliament;American Samoa;India;Prime Minister;Manamఇండియా చెమట చిందించి కట్టించింది.. తాలిబన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు..?ఇండియా చెమట చిందించి కట్టించింది.. తాలిబన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు..?taliban{#}HOSTA;Capital;Parliment;Heart;Ishtam;Parliament;American Samoa;India;Prime Minister;ManamWed, 18 Aug 2021 10:13:00 GMTఅఫ్గాన్‌ ను అమెరికా సైన్యం విడిచి వెళ్లిన తర్వాత తాలిబన్లు చాలా వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. రాజధాని కాబూల్‌లో చొరబడ్డారు. అధికారాన్ని హస్త గతం చేసుకున్నారు. తాలిబన్ల దూకుడుతో ఆ దేశ అధ్యక్షుడే ప్రాణాలు చేతబట్టుకుని విదేశాలకు చెక్కేసారు. ఆ తర్వాత కాబూల్‌లో అడుగుపెట్టిన తాలిబన్ల మూకలు..  ఆ దేశ అధ్యక్ష భవనంలో ఇష్టారాజ్యంగా తిరిగిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు.. ఆ దేశ పార్లమెంట్ భవనంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.


వాళ్ల రాజ్యం.. వాళ్ల ఇష్టం మనకెందుకు అంటారా.. అదీ నిజమే కానీ.. ఆ అఫ్గానిస్తాన్ కు ఇండియా తన చెమట చిందించి ఎన్నో నిర్మాణాలు కట్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఇప్పుడు తాలిబన్ల  విహారం చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఇరుగు పొరుగు బావుంటేనే మనం బావుంటాం అన్న కాన్సెప్టులో ఇండియా అఫ్గాన్ కు అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇందుకు దాదాపు 3 వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అఫ్గాన్‌ను ఆదుకున్న అతిపెద్ద దాతల్లో ఇండియా ఒకటి.


అఫ్గాన్‌కు ఇండియా కట్టించిన నిర్మాణాల్లో ముఖ్యమైంది పార్లమెంట్ భవనం. ప్రజాస్వామ్యానికి గుండె కాయ వంటి పార్లమెంట్‌ను మనమే కట్టించాం.. 1996లో అఫ్గాన్‌ను ఆక్రమించేటప్పుడు అప్పటికి ఉన్న పార్లమెంటు భవనాన్ని తాలిబన్లు బాంబులతో పేల్చేశారు. ఆ తర్వాత ఇండియా అఫ్గాన్‌ కోసం  9 కోట్ల డాలర్లతో పార్లమెంటు భవనాన్ని కట్టించి ఇచ్చింది. ఈ పార్లమెంట్ భవనానికి కూడా మన మాజీ ప్రధాన మంత్రి ఎ.బి.వాజ్‌పేయీ పేరు పెట్టారు. దీని నిర్మాణం 2015లో పూర్తయింది. దీన్ని మన ప్రధాని మోదీయే ప్రారంభించారు కూడా.


ఇక వాటితోపాటు 218 కిలోమీటర్ల హైవేను 15 కోట్ల డాలర్లతో భారత్‌ నిర్మించింది. అఫ్గాన్‌-ఇరాన్‌ సరిహద్దుల్లోని జరాంజ్‌ వద్ద ప్రారంభమై డెలారం వరకూ ఉంది. దీంతో పాటు బహుళ ప్రయోజన అఫ్గాన్‌-భారత్‌ మైత్రి డ్యామ్‌ ను కూడా భారత్‌ తన ఖర్చుతో కట్టించి ఇచ్చింది. దీన్ని 2016 జూన్‌లో ప్రారంభించారు. ఇక్కడి జలవిద్యుత్‌ కేంద్రం 42 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా స్టార్‌ ప్యాలెస్‌ తో పాటు ఎన్నో సౌకర్యాలు ఇండియా కల్పించింది. ఇప్పుడు తాలిబన్లు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు.





ఇండియా చెమట చిందించి కట్టించింది.. తాలిబన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు..?

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>