MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranaut-comments-on-international-kutrabc0dfe04-7ce1-4900-8005-143bf041aa61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranaut-comments-on-international-kutrabc0dfe04-7ce1-4900-8005-143bf041aa61-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. ఈ భామ సోషల్ మీడియా వేదికపై పలు విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలపైనా విరుచుకుపడుతుంది. గతంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు బాలీవుడ్ మాఫియానే కారణమని ఆరోపించింది. తాజాగా ఈ భామ ఆప్ఘనిస్తాన్ సంక్షోభంపైన కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుండగా, సైబర్ నేరస్థులు తన అకౌంట్‌పై దాడిkangana ranaut{#}INTERNATIONAL;bollywood;Kangana Ranaut;bhama;media;Hero;Tamilnadu;Telangana Chief Minister;Teluguబాలీవుడ్ క్వీన్‌పై అంతర్జాతీయ కుట్ర.. ?బాలీవుడ్ క్వీన్‌పై అంతర్జాతీయ కుట్ర.. ?kangana ranaut{#}INTERNATIONAL;bollywood;Kangana Ranaut;bhama;media;Hero;Tamilnadu;Telangana Chief Minister;TeluguWed, 18 Aug 2021 18:27:16 GMTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సంగతి అందరికీ తెలిసిందే. ఈ భామ సోషల్ మీడియా వేదికపై పలు విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలపైనా విరుచుకుపడుతుంది. గతంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు బాలీవుడ్ మాఫియానే కారణమని ఆరోపించింది. తాజాగా ఈ భామ ఆప్ఘనిస్తాన్ సంక్షోభంపైన కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుండగా, సైబర్ నేరస్థులు తన అకౌంట్‌పై దాడి చేశారని తెలిపింది కంగన. చైనాకు చెందిన వారు తన అకౌంట్‌ను హ్యాక్ చేయబోయారని, ఇది అంతర్జాతీయ కుట్ర అని కంగనా రనౌత్ తెలిపింది. తాను ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన తాలిబాన్ సమస్యకు సంబంధించిన పోస్ట్‌లన్నీ అదృశ్యమయ్యాయని పేర్కొంది కంగన. తాను ఇన్ స్టాలో లాగిన్ అయ్యేందకు ట్రై చేస్తున్న ప్రతీ సారి అదే లాగ్‌ అవుట్ అవుతుందని చెప్పింది. ఈ విషయాన్ని షేర్ చేసేందుకు తన సిస్టర్ రంగోలి చందేల్ మొబైల్ యూజ్ చేసినట్లు తెలిపింది. ప్రేక్షకులకు చివరగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘పంగ’ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆమె నటించిన సినిమాలేవీ కూడా విడుదల కాలేదు.

కంగన ప్రస్తుతం ‘తలైవి, ధాకడ్’ చిత్రాల్లో నటిస్తుంది. రెండు సినిమాలు కూడా ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కావడం విశేషం. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన ‘తలైవి’సినిమా తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్నది. ఈ మూవీలో కంగన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను మరిపిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ.ఎల్.విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఎంజీరామచంద్రన్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఇక యాక్షన్ ఫిల్మ్ ‘ధాకడ్’లో కంగన ‘ఏజెంట్ అగ్ని’గా కనిపించబోతున్నది.


ఆ పూనకం ఎక్కడ.. భీమ్లా పై రానా ఎఫెక్ట్!!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>