EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/talibans44cb0ad8-e8b4-43f6-b68b-271f3e88e1c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/talibans44cb0ad8-e8b4-43f6-b68b-271f3e88e1c5-415x250-IndiaHerald.jpgఅఫ్గానిస్తాన్‌లో అరాచక పాలన మొదలైంది. దాదాపు 20 ఏళ్లపాటు కాస్త ప్రశాంతంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు తాలిబన్ల పరిపాలన మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రత్యేకించి ఇతర మతాల వారు హడలిపోతున్నారు. అఫ్గానిస్తాన్‌ ముస్లిం ఆధిపత్య దేశమైనా అక్కడ కూడా హిందువులు, శిక్కులు ఉన్నారు. వారు కూడా అఫ్గాన్‌ పౌరులే.. అయితే.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం రావడంతో వారంతా హడలిపోతున్నారు. తాలిబన్ల అరాచకత్వం, మత చాంధసవాదం గురించి ముందే తెలిసిన అఫ్గాన్ హిందువులు, సిక్కులు ఇప్పుడు ప్రాణాలు అరచేతtalibans{#}Narendra Modi;Indiaభళా మోడీ.. అఫ్గాన్‌ సిక్కులు, హిందువులపై భేషైన నిర్ణయం..?భళా మోడీ.. అఫ్గాన్‌ సిక్కులు, హిందువులపై భేషైన నిర్ణయం..?talibans{#}Narendra Modi;IndiaWed, 18 Aug 2021 07:00:00 GMTఅఫ్గానిస్తాన్‌లో అరాచక పాలన మొదలైంది. దాదాపు 20 ఏళ్లపాటు కాస్త ప్రశాంతంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు తాలిబన్ల పరిపాలన మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రత్యేకించి ఇతర మతాల వారు హడలిపోతున్నారు. అఫ్గానిస్తాన్‌ ముస్లిం ఆధిపత్య దేశమైనా అక్కడ కూడా హిందువులు, శిక్కులు ఉన్నారు. వారు కూడా అఫ్గాన్‌ పౌరులే.. అయితే.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం రావడంతో వారంతా హడలిపోతున్నారు.


తాలిబన్ల అరాచకత్వం, మత చాంధసవాదం గురించి ముందే తెలిసిన అఫ్గాన్ హిందువులు, సిక్కులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తాలిబన్ ముష్కర మూకల చేతిలో ఏ ఏ అకృత్యాలకు గురి కావాల్సి వస్తుందో అన్న ఆవేదన అఫ్గాన్‌కు చెందిన హిందువులు, సిక్కుల్లో కనిపిస్తోంది. అయితే ఇలాంటి వారికి నరేంద్ర మోడీ సర్కారు కాస్త ఊరటనిస్తోంది. అప్గాన్‌లో మైనారిటీలైన హిందువులు, సిక్కులకు ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది.


అంతే కాదు.. అఫ్గాన్‌ లోని సిక్కులు, హిందువుల తరలింపునకు  కేంద్రం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. ఈ-ఎమర్జెన్సీ పేరిట ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేసిన హోంశాఖ... ఈ-ఎమర్జెన్సీ వీసా విధానం అఫ్గాన్‌ పౌరులకు వర్తింపజేస్తోంది. అఫ్గాన్‌ నుంచి ఇండియాకు వస్తామని అఫ్గాన్‌ పౌరులైన సిక్కులు, హిందువుల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానం అమలు చేస్తున్నామని తెలిపింది.


ప్రస్తుతం అఫ్గాన్‌ నుంచి విమాన సర్వీసులు లేవని.. తాలిబన్లు విమాన సేవలు పునరుద్దరించగానే అక్కడి మైనారిటీలైన హిందువులు, సిక్కులను భారత్ తీసుకొస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాలిబన్ల భయంతో అఫ్గాన్ ను విడిచి వెళ్తున్న వారందరికీ ఆశ్రయం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే ఐరాస పిలుపు ఇచ్చింది. ప్రత్యేకించి అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులను కాపాడుకోవాలన్న కేంద్రం నిర్ణయం అభినందనీయం.





చెర్రీ చెవిలో చిరు చెప్పిన మంత్రం ఇదే..!

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>