SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/afghanistan-e6881bab-3f21-44b6-8188-fb66f6cbbb76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/afghanistan-e6881bab-3f21-44b6-8188-fb66f6cbbb76-415x250-IndiaHerald.jpgక‌ల‌ల సౌధాలు కుప్ప కూలినా, నేనే దేశానికి రాజు అని ఎవ్వ‌రో ఒక‌రు ఎప్పుడో అపుడు తోచిన విధంగా త‌మ అధికార ప్ర‌క‌ట‌న‌ను తామే చేసుకున్నా ఈ లోకానికి తెలియాలి.లేదంటే ఆప్ఘ‌న్ చీక‌టి ని అర్థం చేసుకోవ‌డ‌మే క‌ష్టం. అస‌లే క‌ష్టంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో పాలుపోవ‌డం లేని రోజున చైనావోడు, ఇండియావోడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియాలి. afghanistan {#}king;American Samoa;mediaఓవ‌ర్ టు ఆప్ఘ‌న్ : ఆ నేల‌పై సోష‌ల్ మీడియా ఉండాల్సిందే !ఓవ‌ర్ టు ఆప్ఘ‌న్ : ఆ నేల‌పై సోష‌ల్ మీడియా ఉండాల్సిందే !afghanistan {#}king;American Samoa;mediaWed, 18 Aug 2021 19:05:00 GMTమ‌నుషులతో..



గుడ్లగూబ‌ల అరుపుల కాలం

మ‌నుషులతో..



పులి - తోడేలు క‌థ ఒక‌టి

మ‌నుషుల‌దే..



ఇప్పుడు మీడియా ఆప్ఘ‌న్ లో

ఉందో లేదో?

చావు పొలిమేర‌ల్లో 

చేసే రిపోర్టింగ్ ఏ విధంగా?



మ‌నుషులు ఎగిరిపోయేందుకు రావాల్సిన టైం వ‌చ్చేసింది. రెక్క‌లు క‌ట్టుకుని ఎగిరిపోయేందుకు అని రాయాలి. కానీ రెక్క‌లు ఎవ రు ఇస్తారు? ఇదే ప్ర‌శ్న తాలిబ‌న్ల‌ను అడ‌గండి తోలు తీస్తారు. ఇదే ప్ర‌శ్న బైడెన్ ను అడ‌గండి తాట‌ తీయిస్తాడు. ఇదే ప్ర‌శ్న పోనీ మ‌న మోడీ సాబ్ ను అడ‌గండి..తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడ్తాడు. చైనా - అమెరికా - ర‌ష్యా - పోరు మ‌న ఇంటికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసు కోండి అంటే విన‌డం లేదు మ‌న పాల‌కులు. అదెలా ఉన్నా ఆ ఇంట మాత్రం మీడియా ఉన్నా లేక‌పోయినా సోష‌ల్ మీడియా మాత్రం ఉండాల్సిందే అని గాఠ్ఠిగా తీర్మానించేను.


అరుపులు ప‌లు ర‌కాలు

మాట విరుపులవి కూడా

ఇదే కోవ ఇదే తోవ

తెల్చుకో నేర్చుకో


చైనా అరుపు, అమెరికా అరుపు ఒక్క‌టి కావు. కానీ ఆ అరుపును అర్థం చేసుకోవాలంటే సోష‌ల్ మీడియా ఉండాలి. పాపం జూక‌ర్ కు బుద్ధి ఉందో లేదో కానీ వాళ్ల‌ను మాత్రం ఉగ్ర‌వాదులు అని అన‌డం త‌ప్పు! మ‌తోన్మాద శ‌క్తులకు దండీగా డ‌బ్బులు ఇచ్చే సామ్రా జ్య వాద శ‌క్తి నీ ఇంట్లో ఉండ‌గా మ‌ళ్లీ నీవు ఇత‌రుల‌ను, వారి దుఃఖాల‌ను అర్థం చేసుకోక మాట్లాడ‌డం త‌గ‌దు బెర్గ్ బాబు. దేశం శాంతి.. ప్ర‌పంచం శాంతి ఒక్క‌టి కావు అని తేల్చేను. దేశం స్వేచ్ఛ, ప్ర‌పంచం స్వేచ్ఛ ఒక‌టి కావు అని తేల్చాను. మీడియా స్వేచ్ఛ మీడియా రాత ఒక్క‌టి కావు అని కూడా తేల్చేను. క‌నుక మీడియా ఉన్నా లేక‌పోయినా మ‌న ఔదార్యం ఉన్నా లేక‌పోయినా మ‌న వంతు బాధ్య‌త పాటింపులో ఉన్నా లేక‌పోయినా సోష‌ల్ మీడియా అనే విస్తృత మాధ్యమం ఉండాల్సిందే స‌ర్ .. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ..


సిస‌లు సామ్ర‌జ్య‌వాదం

..ఉందో లేదో? మ‌న‌లో?

ఉండ‌కుండా ఉంటేనే మేలు!



క‌ల‌ల సౌధాలు కుప్ప కూలినా, నేనే దేశానికి రాజు అని ఎవ్వ‌రో ఒక‌రు ఎప్పుడో అపుడు తోచిన విధంగా త‌మ అధికార ప్ర‌క‌ట‌న‌ను తామే చేసుకున్నా ఈ లోకానికి తెలియాలి.లేదంటే ఆప్ఘ‌న్ చీక‌టి ని అర్థం చేసుకోవ‌డ‌మే క‌ష్టం. అస‌లే క‌ష్టంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలో పాలుపోవ‌డం లేని రోజున చైనావోడు, ఇండియావోడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియాలి. త‌మ గురించి, ప్ర‌పంచం గురించి తెలుసుకోవాలి. అన‌గా సోష‌ల్ మీడియా ఉండాలి. దీనిపై మ‌ళ్లీ బైడెన్ ఏమ‌న్నా ఎన్న‌న్నా ప‌ట్టించుకోరాదు. సామ్రాజ్య వాద కాంక్ష‌కు ఇండియాలో చోటు లేకున్నా.. ఇండియాను ఏలే పాల‌కుల‌కు కూడా ఈ త‌ర‌హా కోరిక ఒక‌టి ఉందో లేదో మాత్రం నాకు తెలియ‌దు. ఉంటే ప్ర‌మాదం.. ఉన్నా లేకున్నా ఉన్న‌ట్లు మాత్రం న‌టించ‌కండి ప్లీజ్ పాల‌కులూ! మీకు దండం పెడ్తా!


దేశాన్ని న‌డిపే మోడీకి

దేశాన్ని న‌డిపేందుకు సిద్ధం అయిన

మిగ‌తా ఫ్యూచ‌రిస్టుల‌కూ కెరియ‌రిస్టుల‌కూ

ఓ విన్న‌పం మీరు మాత్రం ఆ త‌గాదాలో

త‌ల‌దూర్చ‌కండి వేలు పెట్ట‌కండి కాలు కూడా పెట్ట‌కండి

మీ పుణ్యం ఉంటుంది.. మీ (అ)ప‌రిప‌క్వ ధోర‌ణి ఏ పాటిదో మాకు ఎరుక‌!




తాలిబన్లకు మద్దతు బీజేపీకే మేలు .. ?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>