PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bdaf1671-7d0c-4047-8bd9-a484144af25b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bdaf1671-7d0c-4047-8bd9-a484144af25b-415x250-IndiaHerald.jpgకార్యక్రమాల గురించి, అక్కడి పరిస్థితుల గురించి చర్చించిన దాఖలాలు లేవని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నుంచి వారి వాటా నుంచి నీటిని తరలించికుపోయే ప్రయత్నం చేస్తున్నా ప్రశ్నించే వారే లేరు అన్నట్టుగా పార్టీ పరిస్థితి తయారైంది. ఆంధ్ర అక్రమ జల దోపిడీని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆర్ టిస్ కాలువ ముట్టడికి విఫల యత్నం చేయడం మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఆందోళన కార్యక్రమం జరగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన పాలమూరు జిలPolitical {#}Aqua;Krishna River;Kumaar;District;MLA;Party;revanth;Reddy;Government;palamuru;Revanth Reddy;Congressసొంత జిల్లాను మరిచిన పిసిసి బాస్..?సొంత జిల్లాను మరిచిన పిసిసి బాస్..?Political {#}Aqua;Krishna River;Kumaar;District;MLA;Party;revanth;Reddy;Government;palamuru;Revanth Reddy;CongressWed, 18 Aug 2021 20:15:00 GMTరేవంత్ రెడ్డి  పీసీసీ పదవి చేపట్టి  రెండు నెలలు దగ్గరికి వస్తున్నా  ఇప్పటివరకు సొంత ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన చేయకపోవడం పట్ల  అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ఒక రకంగా నిరాశా నిస్పృహలకు గురవుతున్నాయి. ఏడు సంవత్సరాలుగా అధికారానికి దూరంగా, నిరాశతో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు  రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక  నూతన ఉత్సాహం  నెలకొన్నది.

 దానికి తోడుగా  తటస్థంగా ఉన్నటువంటి యువత సైతం  రేవంత్ రెడ్డి పీసీసీ పదవి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నే  రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి పదవి చేపట్టాక ముందుగా పాలమూరు జిల్లాలోని పర్యటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు అవుతున్న, ఆ జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పార్టీ అభిమానులు  ఒకింత బాధ ఉన్నట్టు తెలుస్తోంది.

..అస్తవ్యస్తమైన పార్టీ..
 ఉమ్మడి పాలమూరు జిల్లాలో నే  కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు  అయోమయంలో పడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు  నేను అంటే నేను అంటూ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరియు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను  నడిపించే అటువంటి సమర్ధులు లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది.  గతంలో నియామకమైన డి సి సి పనితీరు అంతంత మాత్రంగానే ఉన్న కారణంతో  రేవంత్ రెడ్డి ఉమ్మడి  జిల్లాలో పర్యటించడం ద్వారా, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహం వస్తుందని వారు భావించారు.  కానీ పదవి వచ్చిన తర్వాత  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని  ఆయా నియోజకవర్గాల నేతలు  రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి  శుభాకాంక్షలు తెలియజేయడం మినహాయిస్తే పార్టీ కార్యక్రమాల గురించి, అక్కడి పరిస్థితుల గురించి చర్చించిన దాఖలాలు లేవని వారంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కృష్ణా నది నుంచి వారి వాటా నుంచి  నీటిని తరలించికుపోయే ప్రయత్నం చేస్తున్నా  ప్రశ్నించే వారే లేరు అన్నట్టుగా  పార్టీ పరిస్థితి తయారైంది. ఆంధ్ర అక్రమ జల దోపిడీని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆర్ టిస్ కాలువ ముట్టడికి విఫల యత్నం చేయడం మినహాయిస్తే  కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఆందోళన కార్యక్రమం జరగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  తన సొంత జిల్లా అయిన  పాలమూరు జిల్లాపై ఇప్పటివరకు దృష్టి సారించకపోవడం పై  అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



మీట‌ర్ అండ్ మేట‌ర్ : హ‌రీశ్ వ‌ద్ద‌న్నాడు ? సాయిరెడ్డి ఔన‌న్నాడు?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>