LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style436de920-0a2c-4f6b-a3d5-acab0fc90c27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style436de920-0a2c-4f6b-a3d5-acab0fc90c27-415x250-IndiaHerald.jpgసాధారణంగా పెళ్లి అయిన స్త్రీ తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన వరం. అలా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన రోజు నుంచి ఏడాది పాటు బిడ్డకు తల్లి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మరికొంతమంది మూడు , నాలుగు నెలలకే బిడ్డకు తల్లిపాలు అందివ్వడం మానేస్తుంటారు. ఇక మరి కొంతమంది తల్లులు ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు తమ బిడ్డలకు పాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే బిడ్డకు తల్లి పాలు సమృద్ధిగా లభిస్తాయో , అప్పుడే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఈ పాల ద్వారానే లభిస్తాయి. అంతేకాదు శరీరం ఎదుగుదలతో పాటు శరీరంలోని అవయవాలు కLIFE STYLE{#}Cancer;Stree;gold;marriage;WOMENలైఫ్ స్టైల్ : బిడ్డకు పాలిస్తే తల్లికి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా..?లైఫ్ స్టైల్ : బిడ్డకు పాలిస్తే తల్లికి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా..?LIFE STYLE{#}Cancer;Stree;gold;marriage;WOMENWed, 18 Aug 2021 19:00:00 GMTసాధారణంగా పెళ్లి అయిన స్త్రీ తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన వరం. అలా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన రోజు నుంచి ఏడాది పాటు బిడ్డకు తల్లి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మరికొంతమంది మూడు , నాలుగు నెలలకే బిడ్డకు తల్లిపాలు అందివ్వడం మానేస్తుంటారు. ఇక మరి కొంతమంది తల్లులు ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు తమ బిడ్డలకు పాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే బిడ్డకు తల్లి పాలు సమృద్ధిగా లభిస్తాయో , అప్పుడే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు ఈ పాల ద్వారానే లభిస్తాయి. అంతేకాదు శరీరం ఎదుగుదలతో పాటు శరీరంలోని అవయవాలు కూడా చక్కగా పని చేస్తూ, బిడ్డ చురుకుగా ఉండడానికి తల్లిపాలు సహాయపడతాయి. ఇకపోతే తల్లి .. వారి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు మాత్రమే ప్రయోజనం కాదు.. తల్లికి కూడా ప్రయోజనం అని సూచిస్తున్నారు వైద్యులు. బిడ్డలకు పాలివ్వడం వల్ల తల్లులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలా మంది తల్లులు , బిడ్డలకు పాలిస్తే వారి అందం పోతుందని భావించి, తల్లి పాలకు బదులు డబ్బా పాలు ఇస్తూ ఉంటారు. అందుకే మన ప్రభుత్వాలు తల్లిపాల ఆవశ్యకత గురించి తల్లిలో అవగాహన పెంచేందుకు, ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటూ ఉంటారు.అయితే ఈ తల్లి పాల వల్ల బిడ్డకూ ప్రయోజనమే.. అలాగే తల్లికి కూడా..తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అంతేకాదు బిడ్డ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో తల్లి కూడా అంతే మనశ్శాంతిగా, ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. ఇక బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే, తల్లి రొమ్ము పాలు చాలా అవసరం. కాబట్టి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు, తమ పిల్లల బంగారు భవిష్యత్తు  కోసం కొంచెం సమయం కేటాయించి, రొమ్ము పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి వీలుగా ఉంటుంది.





తాలిబన్లకు మద్దతు బీజేపీకే మేలు .. ?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>