Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/koratala78e29490-31c7-4e41-b5af-86ae57ad78b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/koratala78e29490-31c7-4e41-b5af-86ae57ad78b2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైందట . ఈ సినిమాకు వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారను సమాచారం . ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిందని సమాచారం. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించినట్లు సమాచారం. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిKoratala{#}Kalabhairava;Master;satya;satya dev;krishna;shankar;Hindi;cinema theater;dil raju;Remake;m m keeravani;Film Industry;Chiranjeevi;Hero;producer;Producer;News;Darsakudu;koratala siva;Director;Cinemaకొరటాల శివ -సత్యదేవ్ కాంబినేషనులో సినిమా.. ప్రారంభం..!కొరటాల శివ -సత్యదేవ్ కాంబినేషనులో సినిమా.. ప్రారంభం..!Koratala{#}Kalabhairava;Master;satya;satya dev;krishna;shankar;Hindi;cinema theater;dil raju;Remake;m m keeravani;Film Industry;Chiranjeevi;Hero;producer;Producer;News;Darsakudu;koratala siva;Director;CinemaWed, 18 Aug 2021 23:57:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్  అయిన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైందట . ఈ సినిమాకు వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారను సమాచారం .

ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిందని సమాచారం. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించినట్లు సమాచారం. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపినట్లు సమాచారం.

ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సత్యదేవ్ ఒక్కో మెట్టు ఎదుగు కుంటూ వస్తూ హీరో స్థాయికి చేరాడు. విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు సత్య దేవ్. ఇటీవల హీరోగా మారి వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. సత్య దేవ్ ఇటీవల నటించిన బ్లఫ్ మాస్టర్ మరియు ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, తిమ్మరుసు  వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయట.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా మంది హీరోలు షూటింగులకు దూరం అవగా సత్యదేవ్ మాత్రం పలు సినిమాల్లో హీరోగా నటించి OTT, థియేటర్ రెండిటిలో విడుదల చేశారని సమాచారం. అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటించారట . బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి ఓ హిందీ సినిమా చేస్తున్న సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ లో కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.లూసిఫర్ సినిమాలో సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.ఇప్పటికే కొరటాల శివ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.



కరణం ఫ్యామిలీ రూట్ మారుతుందా? ఆమంచికి సెట్ అవుతుందా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>