PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vizag-steel-plant-issue9079bcbf-46fa-4efe-ba90-0a218e48bee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vizag-steel-plant-issue9079bcbf-46fa-4efe-ba90-0a218e48bee3-415x250-IndiaHerald.jpgవీటితో పాటు తన పార్టీ నాయకులను స‌రిగ్గా సమీకరించుకోకపోవడం దెబ్బేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీఎనివాస్ కి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేయకపోవడంతో కోపగించిన యాదవుల్లో మెజార్టీ మెంబ‌ర్స్ ఇందుకు పవన్ - బాబుల మధ్య లోపాయికారీ ఒప్పందమే అని భావించి జనసేనకు యాంటీ చేశారు. ఇలా కర్ణుడి చావుకు సమస్త కారణాలు అన్నట్లుగా పవన్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే గతం గతహా. పవన్ కి మళ్ళీ జనాదరణ పెరగాలీ అంటే పోయిన చోటనే వెతకాలి. గాజువాక విషయంలో మాత్రం పవన్ తప్పు చేస్తున్నారు. pawan kalyan{#}Gajuwaka;Vishakapatnam;MLA;TDP;prema;CBN;Party;Chiranjeevi;Love;kalyan;YCP;Telugu;Nijamఆ న‌గ‌రం పేరు చెపితే ప‌వ‌న్‌కు అంత కోపమా..!ఆ న‌గ‌రం పేరు చెపితే ప‌వ‌న్‌కు అంత కోపమా..!pawan kalyan{#}Gajuwaka;Vishakapatnam;MLA;TDP;prema;CBN;Party;Chiranjeevi;Love;kalyan;YCP;Telugu;NijamWed, 18 Aug 2021 17:55:00 GMTపవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలియదు అని చాలా మంది అంటారు. బహుశా అదే నిజం అనిపించేలా ఆయన వ్యవహార శైలి కూడా ఉంద‌న్న‌దే తెలుగు రాజ‌కీయ మేథావుల మాట‌..! పవన్ కి కానీ.. మెగాస్టార్ చిరంజీవికి కానీ ఉత్తరాంధ్రా నిండా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి విశాఖలో మెగా హీరోల సినిమాలు ఫ్లాప్ టాక్ వచ్చినా బాగా ఆడతాయి. రికార్డుకు క్రియేట్ చేస్తాయి. అంతటి వీరాభిమానం విశాఖ మెగా ఫ్యాన్స్ ది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా తనకు ఓటమి ఉండదు అనుకుంటూ గాజువాక దాకా వచ్చి పోటీ చేశారు. నిజంగా ఆ ఎన్నికల్లో పవన్ చేసిన తప్పు ఏంటి అంటే రెండు చోట్ల పోటీ చేయడం. పైగా భీమవరానికి ఇచ్చిన ప్రాధ్యాన్యత గాజువాకకు ఇవ్వకపోవడం. నామినేషన్ వేసిన తరువాత ఒక్కసారే మళ్ళీ రావడం, అరకొరగా ప్రచారం చేయడం. దీనికి తోడు ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి కూడా స్ట్రాంగ్‌గా ఉండ‌డం... ప‌వ‌న్ సామాజిక వ‌ర్గ ఓట్ల‌లో చీలిక ఇవన్నీ కూడా పవన్ ఓటమికి కారణాలు.

వీటితో పాటు తన పార్టీ నాయకులను స‌రిగ్గా సమీకరించుకోకపోవడం దెబ్బేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీఎనివాస్ కి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేయకపోవడంతో కోపగించిన యాదవుల్లో మెజార్టీ మెంబ‌ర్స్ ఇందుకు పవన్ - బాబుల మధ్య లోపాయికారీ ఒప్పందమే అని భావించి జనసేనకు యాంటీ చేశారు. ఇలా కర్ణుడి చావుకు సమస్త కారణాలు అన్నట్లుగా పవన్ ఓటమికి ఎన్నో కారణాలు  ఉన్నాయి. అయితే గతం గతహా. పవన్ కి మళ్ళీ జనాదరణ పెరగాలీ అంటే పోయిన చోటనే వెతకాలి. గాజువాక విషయంలో మాత్రం పవన్ తప్పు చేస్తున్నారు.

ఆ మాటకు వస్తే తనను ఓడించారు అన్న బాధ ఉందో ఆవేదన ఉందో కానీ ఆయన విశాఖకే రాకుండా దూరం పాటిస్తున్నారు. రాజకీయాల్లోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ పట్టుదలలు ఆసలు పనికిరావు. అవ‌స‌ర‌మైన చోట ఓ మెట్టు దిగి.. మ‌న స్థాయిని సైతం త‌గ్గించుకోవాలి. మ‌ల‌ను ఛీత్క‌రించిన జనాలను కూడా ఆకట్టుకోవాలి. వారి ప్రేమను తిరిగి పొందాలి. పవన్ మాత్రం విశాఖ వైపు రెండేళ్ళుగా కన్నెత్తి చూడకపోవడం పట్ల సొంత పార్టీ జనసేనలోనూ అసంతృప్తి ఉంది. తమ నాయకుడు ఒక్కసారి వచ్చి పోరాదా అని వారు కూడా కోరుకుంటున్నారు.

ఆయ‌న సొంత జిల్లాలోని భీమ‌వ‌రంలో పోటీ చేసి ప‌వ‌న్ ఓడిపోయారు. అయితే అక్క‌డ రెండు మూడుసార్లు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. పైగా నాగ‌బాబు కూడా అక్క‌డ ప‌ర్య‌టించారు. గాజువాక వైపు మాత్రం ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. వైసీపీ రెండున్నరేళ్ల పాలన తరువాత జనాలకు మోజు తగ్గిందని, ఈ టైం లో పవన్ విశాఖ వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తే భవిష్యత్తులో పార్టీకి అది ప్లస్ అవుతుంది అని వారు అంటున్నారు. కానీ జనసేనాని ఇపుడు బాగా బిజీ కూడా అయిపోయారు. ఆయన సినిమాలు ఎపుడు పూర్తి అవుతాయి. ఆయ‌న ఎప్పుడు ? ఏపీకి వస్తారు, మరెప్పుడు విశాఖ వస్తారు. మొత్తానికి చూస్తే పవన్ విశాఖ మీద అలిగాడా అన్నదే చర్చగా ఉంది మరి.





పవన్ ఎందుకు కేవలం రీమేక్ సినిమాలే చేస్తున్నాడు ?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>