PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimal-bharat76b7c9e7-221b-4807-98c9-8de3e268de4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nimal-bharat76b7c9e7-221b-4807-98c9-8de3e268de4d-415x250-IndiaHerald.jpgముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల వెనుక బాటు ప్రాంతాలు అనేకం ఉన్నాయి. విభజన చట్టం కూడా స్పష్టంగా ఏ మేరకు సాయం చే యాలో చెబుతోంది. కానీ వెనుకబాటు నివా రణకు,వలసల నివారణకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలేంటో ఇప్పటి కీ స్పష్టం కాలేదు. nimal bharat{#}central government;Telugu;Minister;electricityనిర్మల భారతం : మా ఇంటి కోడలే కానీ...నిర్మల భారతం : మా ఇంటి కోడలే కానీ...nimal bharat{#}central government;Telugu;Minister;electricityWed, 18 Aug 2021 15:15:00 GMTకీలక రంగాలకు ఆమె ఊతమిస్తారన్న భావనే తప్పుగా ఉంది ఇవాళ. విద్యుత్ సంస్కరణ పేరిట కొత్త మీటర్ల బిగింపునకు ముం దుకు వస్తున్నారే తప్ప! ఆ రంగానికి ఏదో ఒక విధంగా ఊరట ఇచ్చేలా చేయూత ఇస్తానని మాత్రం ఆమె చెప్పరు. బడా పెట్టుబడి దారులకు తమ వైపు నుంచి మద్దతు పలికే కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చిన్న చిన్న పరిశ్రమలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కా స్తో,కూస్తో మనుగడలో ఉన్న కుటీర పరిశ్రమలకూ అస్సలు ఊతం ఇవ్వరు. నేతన్న మగ్గం, కుమ్మరి చక్రం, రైతన్న నాగలి ఇవి కదలక పోతే, ఇవి పనిచేయక ఓ మూలకు చేరుకుంటే సంబంధిత గ్రామాలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. కానీ గ్రా మాలకు ఊతం ఇచ్చేలా ఆమె ఏమీ మాట్లాడరు. పౌర జీవనం సాఫీగా సాగేందుకు తమ కష్టం ధారపోసే శ్రామిక వర్గాలకు ఆమె ఏమీ ఇవ్వరు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యధిక గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం కల్పించే మౌలిక వసతులు ఏంటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం.


తెలుగు రాష్ట్రాలకు
వ్యవసాయం ఆధారం
కానీ ఆ రంగం పట్టని
మంత్రి ఆమె?
తీవ్ర సంక్షోభాలు తెలుగు రాష్ట్రాలను కదిపి కుదిపేస్తున్నాయి. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయ్యాక వాటికో పరిష్కారం ఇస్తారని ఆశించినా,అవేవీ ఇప్పటి వరకూ జరగలేదు. ముఖ్యంగా జీఎస్టీ బకాయిలను ఇప్పించడంలో ఆమె చొరవ ఏమీ లేదు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు పేరుకుపోవడంతో ఇటీవల కేంద్రం కూడా తమ అసక్తతతను చెప్పకనే చెప్పింది. కానీ పరిష్కారం అంటూ ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాలకు ఊతం ఇచ్చేందుకు, వ్యవసాయాధార  బ్యాంకులకు ఊతం ఇ చ్చేందుకు ఆమె చెప్పింది చేసింది ఏమీ లేదు.

ఉచిత విద్యుత్ కు మేం వ్యతిరేకం
వ్యవసాయం చేనేత రంగాల్లో తీవ్ర నష్టం
ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల వెనుక బాటు ప్రాంతాలు అనేకం ఉన్నాయి. విభజన చట్టం కూడా స్పష్టంగా ఏ మేరకు సాయం చే యాలో చెబుతోంది. కానీ వెనుకబాటు నివా రణకు,వలసల నివారణకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలేంటో ఇప్పటి కీ స్పష్టం కాలేదు. ప్యాకేజీ పేరిట తీసుకున్న నిధుల గురించి మాత్రమే పదే పదే ప్రస్థా విస్తారు తప్ప! తాము చేయగలిగిం దేంటో అస్సలు చెప్పరు. ఇక్కడ వ్యవసాయ, విద్యుత్ రంగాలకు చేయూత ఇవ్వాలి కానీ ఇవ్వరు. చేనేత రంగానికి చేయూత ఇవ్వాలి ఇ వ్వరు. చేనేత దినోత్సవాలకు మాత్రం పొందూరు వస్తారు. కొద్దిసేపు మాట్లాడి మాత్రం తమ పని అయిందన్న విధంగా ప్రవర్తించి హస్తినకు వెళ్లిపోతారు. సంక్షోభంలో వ్యవసా యం, చేనేత రంగాలు ఉన్నప్పుడు కనీసం విద్యుత్ పరంగా అయినా కొంత ఆదుకుం టే మేలు. ఉచిత విద్యుత్ తాము వ్యతిరేకం అని చెప్పగలరే తప్ప ఇంకేమీ చేయరు.. చెందరు.





నిర్మ‌ల భార‌తం : అత్తా ! మా మాట విను

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>