MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/fahad-fazil3e285415-19c3-4471-8c2c-a5804e84d0f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/fahad-fazil3e285415-19c3-4471-8c2c-a5804e84d0f5-415x250-IndiaHerald.jpgఈ మలయాళ స్టార్ హీరో ఎవ్వర్నీ వదిలేలా లేడే... అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఇదే అనుకుంటారు. ఆ విషయం ఏమిటంటే మలయాళ స్టార్ హీరో టాలీవుడ్ లో స్టార్ల సినిమాల్లో వరుసగా ఆఫర్లు పట్టేస్తున్నాడు. మన హీరోలకు కూడా ఇప్పుడు అతను తప్ప మరో ఆప్షన్ కన్పించడం లేదు. అయితే అతనేమీ అల్లాటప్ప నటుడు కాదు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన నటుడు. తన నటనతో అందరి మన్ననలు పొందిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్. ఆయన ఇప్పుడు మాతృభాషలోనే కాకుండా పొరుగు భాషల్లో కూడా వరుస ఆఫర్లతో హడావిడి చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లFaahad Fasil;{#}vijay sethupathi;Kiara Advani;Wanted;Allu Arjun;Tollywood;Industry;shankar;Ram Charan Teja;Chitram;Hero;India;Cinema;bollywood;Pawan Kalyanఈ మలయాళ స్టార్ హీరో ఎవ్వర్నీ వదిలేలా లేడే !ఈ మలయాళ స్టార్ హీరో ఎవ్వర్నీ వదిలేలా లేడే !Faahad Fasil;{#}vijay sethupathi;Kiara Advani;Wanted;Allu Arjun;Tollywood;Industry;shankar;Ram Charan Teja;Chitram;Hero;India;Cinema;bollywood;Pawan KalyanWed, 18 Aug 2021 16:04:00 GMTఈ మలయాళ స్టార్ హీరో ఎవ్వర్నీ వదిలేలా లేడే... అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఇదే అనుకుంటారు. ఆ విషయం ఏమిటంటే మలయాళ స్టార్ హీరో టాలీవుడ్ లో స్టార్ల సినిమాల్లో వరుసగా ఆఫర్లు పట్టేస్తున్నాడు. మన హీరోలకు కూడా ఇప్పుడు అతను తప్ప మరో ఆప్షన్ కన్పించడం లేదు. అయితే అతనేమీ అల్లాటప్ప నటుడు కాదు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన నటుడు. తన నటనతో అందరి మన్ననలు పొందిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్. ఆయన ఇప్పుడు మాతృభాషలోనే కాకుండా పొరుగు భాషల్లో కూడా వరుస ఆఫర్లతో హడావిడి చేస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న "పుష్ప" చిత్రంలో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు మరో మెగా హీరోతో ఢీకొట్టే అవకాశం లభించింది అనేది టాలీవుడ్ టాక్. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఆర్సి15". బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించబోతున్నాడు అనే రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇదంతా చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలకు పవర్ ఫుల్ విలన్ ఫహద్ అని మన దర్శకులు అనుకుంటున్నట్టు అన్పిస్తోంది. ఈ హీరోకు ఛాన్స్ ఇస్తే టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోనూ వదలకుండా అందరితోనూ తలపడేలా కనిపిస్తున్నాడు.

కొంతకాలం క్రితం సౌత్ ఇండస్ట్రీ మొత్తం విలన్ అనగానే విజయ్ సేతుపతి వైపు చూసింది. ఆయన విలన్ గానే కాకుండా హీరోగానూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు విజయ్ సేతుపతి స్థానాన్ని ఫహద్ ఫాసిల్ భర్తీ చేస్తున్నారు. ఈ హీరో టాలీవుడ్ కు మోస్ట్ వాంటెడ్ పవర్ ఫుల్ విలన్ గా మారిపోయాడు. మరి రామ్ చరణ్ సినిమాకు ఫహద్ విలన్ గా మారతాడో లేదో వేచి చూడాల్సిందే.



ఆ పూనకం ఎక్కడ.. భీమ్లా పై రానా ఎఫెక్ట్!!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>