PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afghandca25d65-a0f0-401e-a95d-b5a9c6bec428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afghandca25d65-a0f0-401e-a95d-b5a9c6bec428-415x250-IndiaHerald.jpgతిండికి లేని రోజు..ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేని రోజు..ప‌సిబిడ్డ‌లకు పాలివ్వ‌లేని త‌ల్లులున్న రోజు..ఇంట్లో ఏముందో ఏం లేదో తెల్సుకోకుం డా ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని ప‌రు గులు తీస్తున్న రోజు..ఆప్ఘ‌న్ లో ఉంది. ఆప్ఘ‌న్ లో న‌మోదితం అయి ఉంది. కానీ పాల‌కు లకు ఇవేవీ ప‌ట్ట‌వు. afghan{#}American Samoaఆప్ఘ‌న్ స్పీక్స్ : అత‌డు చావుల మ‌ధ్య ఏకాభిప్రాయ సాధ‌కుడుఆప్ఘ‌న్ స్పీక్స్ : అత‌డు చావుల మ‌ధ్య ఏకాభిప్రాయ సాధ‌కుడుafghan{#}American SamoaWed, 18 Aug 2021 20:17:09 GMTచావుల మ‌ధ్య ఏకాభిప్రాయం

అదేలేండి మృత్యు హోరులో

మ‌నుషుల మ‌ధ్య ఏకాభిప్రాయం



జీవ‌న్మ‌ర‌ణ వేళ‌లో కూడా ఏకాభిప్రాయం

తీసుకు రావాలి..వెలుగు తేవాలి

అబ్బా! ఇంత‌టి పాజిటివ్ వైబ్ ను త‌ట్టుకోలేం


కానీ అత‌డు

అలానే చెప్పాడు క‌నుకనే నేను ఇలా రాశాను


తిండికి లేని రోజు..ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేని రోజు..ప‌సిబిడ్డ‌లకు పాలివ్వ‌లేని త‌ల్లులున్న రోజు..ఇంట్లో ఏముందో ఏం లేదో తెల్సుకోకుం డా ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని ప‌రు గులు తీస్తున్న రోజు..ఆప్ఘ‌న్ లో ఉంది. ఆప్ఘ‌న్ లో న‌మోదితం అయి ఉంది. కానీ పాల‌కు లకు ఇవేవీ ప‌ట్ట‌వు. ఇదే అదునుగా దేశం దాటిపోయే పాల‌కులు కొంద‌రు. ఇదే అదు నుగా శ‌ర‌ణార్థుల కోసం రాజ‌కీయం న‌డిపే వా రు కొంద‌రు. ఇదే అదునుగా త‌మ ప్ర‌యోజ‌నాలు తీర్చుకునే ఆత్రంలో కొంద‌రు..ఇంతమంది ఘ‌నులున్న ఆ దేశాన ఇప్పుడు ప్రజాస్వామ్యం, శాంతి వ‌చ‌నం, స‌హ‌న మార్గం పునః స్థాప‌న‌కు నోచుకుంటాయిని అనుకోకుండ్రి. ఇదే వేళ పాపం ఒకాయ‌న తానే ఈ దేశాధ్య‌క్షుడ్ని అని చెప్పుకున్నాడు. బ‌ ల్ల‌లు చ‌రుస్తున్నాడు. ఆ అరుపు ఆ గోల ఎందాక ఉందంటే..చ‌దువుండ్రి


ఆయ‌న పేరు అమ్రుల్లా స‌లేహ్..ఆప్ఘ‌న్ దేశ‌పు ఉపాధ్య‌క్షుడు..తాలిబ‌న్ల దెబ్బకు దేశం విడిచి పారిపోయాడు అధ్య‌క్షుడు ఘ‌నీ..ఇదే అద‌నుగా అక్క‌డి రాజ్యాంగం వెతుకులా ట‌లో ప‌డి, అప్ప‌టిదాకా అమ‌లులో ఉన్న చ‌ట్టాలో, నియ‌మాలో వెతికి తానే ఈ దేశ‌పు అధ్య‌క్షుడ్ని అని, భావి ఆప్ఘ‌న్ ను న‌డిపించే రాజ‌కీయ శ‌క్తిని అని బుల్లి పిట్ట మాధ్య‌ మం ద్వారా తెలిపి, పాపం ప్ర‌పంచానికి క‌ళ్లు తెరిపించి, కొత్త ప‌ద‌వికి అర్హ‌త ఏంట‌న్న‌ది కూడా చెప్పి, సెల‌విచ్చి మురిసిపోయాడు. చావుల మ‌ధ్య ఏకాభిప్రాయం అంటే ఇదే! మ‌నుషుల కొట్లాట ఒక‌రికి వినోదం..ఒక‌రికి ప‌ద వినోదం మ‌రొకరికి ప‌ద‌వీ వినోదం..ఈ ఆట ఆగేంత వ‌ర‌కూ మ‌నం ఇంకొన్ని వినాలి. వినాల్సి వ‌స్తుంది. సామ్రాజ్య వాదుల ఉ నికి ఎలా ఉందో తెల్సుకోవాలి. అమెరికా అరుపూ  దానికి కార‌ణం.. చైనా అరుపూ దానికి కార‌ణం వెతికి వెతికి విసిగిపోవాలి. ఆప్ఘ‌న్ లో శాంతి స్థాప‌న అనే ప‌దం ద‌గ్గ‌ర ఎన్ని దేశాలు వ‌చ్చి క‌త్తులూ క‌టార్లూ వ‌దిలి వెళ్తాయో కూడా వేచి చూడాలి. అందాక లేదు విశ్రాంతి మ‌న‌కు అన్న క‌వి వాక్కే మీకూ మరియూ ఈ రాత రాసిన ర‌త్న కిశోరుడికీ తో డు.





రేవంత్‌రెడ్డి రెచ్చిపోయారా? రెచ్చగొట్టారా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>