PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrcbfb952b-4ce5-4e75-861d-f5c2b3ec6545-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrcbfb952b-4ce5-4e75-861d-f5c2b3ec6545-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు రాష్ట్ర ఖజానాను గండి కొట్టేలా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రకటిస్తున్న పథకాలు , హామీలు అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ అమ్ముతోంది. మరోసారి ప్రభుత్వ భూముల వేలానికి రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవడంతో పాటు నిరుపయోగంగా మారుతున్నాయన్నా సాకుతో.. జిల్లాల్లోని భూముల వివరాలు సేకరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసంkcr promices can clear treasurary{#}Ranga Reddy;Huzurabad;Elections;Cabinet;Hyderabad;KCR;Telangana;Telangana Chief Minister;CM;Governmentకేసీఆర్‌ వరాల జల్లు ఖజానాకు గండి కొడుతుందా?కేసీఆర్‌ వరాల జల్లు ఖజానాకు గండి కొడుతుందా?kcr promices can clear treasurary{#}Ranga Reddy;Huzurabad;Elections;Cabinet;Hyderabad;KCR;Telangana;Telangana Chief Minister;CM;GovernmentWed, 18 Aug 2021 19:46:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు రాష్ట్ర ఖజానాను గండి కొట్టేలా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రకటిస్తున్న పథకాలు , హామీలు అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ అమ్ముతోంది. మరోసారి ప్రభుత్వ భూముల వేలానికి రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవడంతో పాటు నిరుపయోగంగా మారుతున్నాయన్నా సాకుతో.. జిల్లాల్లోని భూముల వివరాలు సేకరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం కేబినెట్ సబ్ కమిటీనికూడా కేసీఆర్ నియమించారు. దాదాపు రూ. 35 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా హైదరాబాద్ , రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలొ కోకాపేట్, ఖానామెట్‌లో 40 ఎకరాలు అమ్మింది. తద్వారా దాదాపు రూ.౩ వేల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంది. భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను లెక్కచేయని కేసీఆర్ సర్కార్ మరో భారీ వేలానికి సిద్ధమైంది.

ప్రస్తుతం పుప్పాలగూడలోని విలువైన కాందిశీకుల భూములు అమ్మడం ద్వారా మరో పదివేల కోట్ల రూపాయలను సమకూర్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆరు  సర్వేనెంబర్లలో దాదాపు రెండు వందలకు పైగా ఎకరాల భూమి విషయంలో గతంలో కొందరు  కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను కూడా వేలం వేయాలని భావిస్తోంది. దీనికోసం రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అయితే భూములు అమ్మి డబ్బులు సమకూర్చుకుంటున్న  సర్కార్... మరోవైపు ఎన్నికలు రాగానే ఖజానాను ఖాళీ చేస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు లేక సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి హామీల జల్లులు కురిపిస్తున్నారు. రాష్ట్రాన్ని మరింత అప్పుల ఉబిలోకి నెట్టేస్తున్నారు. ఖాజానాలో డబ్బులు లేక  ఉద్యోగులకు , పెన్షర్‌లకు సకాలంలో  జీతాలు అందని పరిస్థితి ఉంది. ఓ వైపు ధనిక రాష్ట్రమని చెబుతూ.. భూములు అమ్మడం ద్వారా రాబోయే తరాలకు సీఎం ఏం చెప్పదలచుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.



ఆ మాట విని : వైజాగ్ స్టీల్ కొనే యోచ‌న‌లో టీ స‌ర్కార్ ?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>