PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp96acdef4-0111-4061-8e9f-c404d3674609-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp96acdef4-0111-4061-8e9f-c404d3674609-415x250-IndiaHerald.jpgఆశ్చర్యకరంగా కొన్ని గొంతులు పైకి లేస్తున్నాయి. జంకూ గొంకూ లేకుడా అవి మాట్లాడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను కళ్లారా చూస్తున్నా వారి సైద్ధాంతిక భూమికను బట్టి అలాగే గొంతుని సవరించుకుంటున్నాయి. అలా మాట్లాడడం వల్ల తాము కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాయి. bjp{#}Bharatiya Janata Partyతాలిబన్లకు మద్దతు బీజేపీకే మేలు .. ?తాలిబన్లకు మద్దతు బీజేపీకే మేలు .. ?bjp{#}Bharatiya Janata PartyWed, 18 Aug 2021 21:00:00 GMTఆశ్చర్యకరంగా కొన్ని గొంతులు పైకి లేస్తున్నాయి. జంకూ గొంకూ లేకుడా అవి మాట్లాడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను కళ్లారా చూస్తున్నా వారి సైద్ధాంతిక భూమికను బట్టి అలాగే గొంతుని సవరించుకుంటున్నాయి. అలా మాట్లాడడం వల్ల తాము కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాయి.

దేశంలో ఇపుడు కొన్ని విపక్ష పార్టీలతో పాటు కొన్ని వర్గాలకు చెందిన నేతలు తాలిబన్ల గురించి మద్దతుగా మాట్లాడుతున్నారు. అంతే కాదు వారిది దేశ భక్తి అంటున్నాయి. ఇక ఒక ప్రముఖ విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అయితే భారత్ తన స్వాతంత్రం కోసం పోరాడినట్లుగా తాలిబన్లు ఆఫ్హ్గాన్ కోసం చేశారు అంటూ కధను  ఎక్కడికో తీసుకుపోయారు. ఇలా ఎవరి బుర్రలకు తోచిన తీరున వారు మాట్లాడుతున్నారు.

మరో వైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఎంపీ అయితే తాలీబన్లతో చర్చలు జరపమన్నారు. మిగిలిన దేశాలు అన్నీ పోటీ పడుతూంటే మనమెందుకు వెనక్కు తగ్గాలంటూ సలహా ఇచ్చారు. ఇక ప్రముఖ విపక్ష నాయకులం అనిపించుకున్న వారంతా ఇదే తీరున స్పందిస్తున్నారు. మోడీజీ మీ విదేశాంగ విధానం ఏంటో చెప్పమంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విదేశాంగ విధానం ఏంటో కానీ వీరి విధానం ఇలా బయటపెట్టేసుకున్నారు.

నిజానికి వీరు మౌనంగా ఉన్నా కూడా వారి విధానం ఏంటో జనాలకు ఎరుకే. ఇది మెల్లగా మొదలైన వాదన. ఇలా పెరిగి పెరిగి ఎక్కడికో చేరుకుంటుంది. అలా జరగాలని బీజేపీ కోరుకుంటోంది కూడా. ఈ దేశంలోని ప్రజలు కూడా దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. వారు తొందరపడడంలేదు, తడబాటు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇలా మాట్లాడి మద్దతు ఇస్తున్న గొంతుల వెనక ఏముందో కూడా వారు చూసి చెప్పేయగలరు. అందువల్ల బీజేపీ కి ఇలాగే కావాలి. ఈ గొంతులు ఇలాగే చించుకోవాలి. దేశ ప్రజలకు కూడా ఒక క్లారిటీ రావాలి. అన్నీ కుదిరితే మళ్లీ బీజేపీదే అధికారం. 2019 ఎన్నికల్లో దాయాది పాక్ తో జరిగిన ఒక ఆపరేషన్ బీజేపీని కాపాడింది. ఈసారి బీజేపీ గెలవదు అనుకున్న వారికి ఇపుడు గెలిపించేందుకు సరంజామా అంతా రెడీ అయింది. చూడాలి మరి అది ఎంతదాకా వెళ్తుందో.





అఖిల్ ఫేట్ ను మార్చే వ్యక్తి అతనేనా..?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>