MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa276c330e-f305-4306-93c1-752faadbdd69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa276c330e-f305-4306-93c1-752faadbdd69-415x250-IndiaHerald.jpgఒకనాడు తెలుగులో అటు నందమూరి ఇటు ఘట్టమనేని అన్నట్లుగా సీన్ ఉండేది. ముఖ్యంగా సెవెంటీస్ లో ఎన్టీయార్, క్రిష్ణల మధ్య అతి పెద్ద పోటీ కూడా సాగింది. ఈ ఇద్దరు హీరోలూ టాలీవుడ్ ని మేలి మలుపు తిప్పారు. ఇక సినీ రంగానికి సంబంధించి సమస్యలు ఏవైనా ఉన్నా ఎన్టీయార్ నేరుగా పరిష్కరించేవారు. maa{#}Tollywoodనందమూరి... ఘట్టమనేని సైడ్ అయినట్లేనా... ?నందమూరి... ఘట్టమనేని సైడ్ అయినట్లేనా... ?maa{#}TollywoodTue, 17 Aug 2021 19:02:59 GMTఒకనాడు తెలుగులో అటు నందమూరి ఇటు ఘట్టమనేని అన్నట్లుగా సీన్ ఉండేది. ముఖ్యంగా సెవెంటీస్ లో ఎన్టీయార్, క్రిష్ణల మధ్య అతి పెద్ద పోటీ కూడా సాగింది. ఈ ఇద్దరు హీరోలూ టాలీవుడ్ ని మేలి మలుపు తిప్పారు. ఇక సినీ రంగానికి సంబంధించి సమస్యలు ఏవైనా ఉన్నా ఎన్టీయార్ నేరుగా పరిష్కరించేవారు. ఆయన దృష్టి దాటి ఏ విషయమూ ముందుకు పోయేది కాదు. ఎన్టీయార్ తో పాటు గా క్రిష్ణ కూడా టాలీవుడ్ మీద మంచి పట్టు సంపాదించారు. సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నపుడు క్రిష్ణ కూడా లీడ్ రోల్ ప్లే చేసేవారు. ఇక సినిమా రంగం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కొన్నాళ్ల పాటు క్రిష్ణ హవా నడిచింది.

ఆ తరువాత మా వ్యవహారాలను దాసరి నారాయణరావు చూసేవారు. ఆయనకు నచ్చిన హీరో మురళీమోహన్ మా  ప్రెసిడెంట్ గా సుదీర్ఘ కాలం పనిచేసేవారు. ఇక కొన్నేళ్ళుగా మా మీద పెత్తనం మారింది. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీదే పెద్ద పీట. దాంతో వారిదే మాలోనూ పై చేయిగా ఉంది. దాసరి పోయాక చిరంజీవి పెద్దరికం భుజాన వేసుకున్నారు. ఆయన అనుకున్న వారే మా ప్రెసిడెంట్స్ అవుతూ వస్తున్నారు. గతసారి ఎన్నికల్లో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి నరేష్ నిలబడినా కూడా చిరంజీవి వైపు నుంచి మద్దతు లభించింది.

ఈసారి మాత్రం ప్రకాష్ రాజ్ కి వారు మద్దతు ఇస్తున్నారు. దాంతో అటు ఘట్టమనేని ఫ్యామిలీ కూడా సైడ్ అయినట్లుగా ఉంది. ఇంకో వైపు బాలయ్య, జూనియర్ ఎన్టీయర్ వంటి మాస్ స్టార్లు, కళ్యాణ్ రామ్  లాంటి హీరో ఉన్నా కూడా నందమూరి ఫ్యామిలీ మా లో ఎలాంటి కీ రోల్ ప్లే చేయలేకపోతోంది. పైగా సినీ పెద్దల జాబితాలో కూడా బాలయ్యను పక్కన పెట్టేస్తున్నారు. బాలయ్య మీడియా ముందుకు వచ్చి అపుడపుడు అసంతృప్తి వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మొత్తానికి నటనలో తండ్రి లెగసీని కొనసాగిస్తున్న బాలయ్య సినీ రాజకీయాల్లో మాత్రం తేలిపోతున్నారు అన్న టాక్ ఉంది. దాంతో పాటు పెద్దరికాన్ని దక్కించుకోవడంలో కూడా వెనకబడ్డారని అంటున్నారు. ఇంకో వైపు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తన హవాను చాటుకుంటున్నారు. ఆయన మెగాస్టార్ వైపు ఉండడం ద్వారా తానూ సినీ పెద్దనే అనిపించుకుంటున్నారు. ఈ సినీ రాజకీయాల్లో నందమూరి వారి ఊసు మాత్రం లేకుండా పోతోందనే చెప్పాలి. మరి బాలయ్య ఏమైనా జూలు విదిలిసే కధ వేరే మలుపు తిరగవచ్చు.







తాలిబ‌న్ల‌పై గెరిల్లా పోరు?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>