MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-hindhi-web-series8e044d11-bf08-4708-aa94-ce76e7dc64f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-hindhi-web-series8e044d11-bf08-4708-aa94-ce76e7dc64f4-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ఓ మెరుపు లాంటి వార్త బయటికి వచ్చింది. బాలీవుడ్ వైపుకు వెంకీ అడుగులు పడుతున్నాయంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన అన్నయ్య ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. అంతే కాదు బాబాయ్ కి తోడుగా అబ్బాయ్ రానా కూడా హిందీ భాష పలకనున్నారట.VENKEY-HINDHI-WEB SERIES{#}Genre;Annayya;Yevaru;rana daggubati;Suresh;Daggubati Venkateswara Rao;Hindi;Venkatesh;CBN;Hero;media;bollywood;Telugu;Tollywood;Cinemaనారప్ప అక్కడ కూడా తన హవా చూపిస్తాడా ?నారప్ప అక్కడ కూడా తన హవా చూపిస్తాడా ?VENKEY-HINDHI-WEB SERIES{#}Genre;Annayya;Yevaru;rana daggubati;Suresh;Daggubati Venkateswara Rao;Hindi;Venkatesh;CBN;Hero;media;bollywood;Telugu;Tollywood;CinemaTue, 17 Aug 2021 09:00:00 GMTవిక్టరీ వెంకటేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ఓ మెరుపు లాంటి వార్త బయటికి వచ్చింది. బాలీవుడ్ వైపుకు వెంకీ అడుగులు పడుతున్నాయంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన అన్నయ్య ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. అంతే కాదు బాబాయ్ కి తోడుగా అబ్బాయ్ రానా కూడా హిందీ భాష పలకనున్నారట. అయితే ఇది సినిమా కాదట..
వెంకీ, మరియు రానాలు కలిసి ఓటీటీ వేదికపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ మొట్ట మొదటిసారిగా వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమై పోయారని సమాచారం. ఇటీవల సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో పలకరించిన ఆయన..అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్‌ లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తూ అభిమానుల్ని అలరించారు సురేష్ బాబు.  

ఈ సందర్భంగా  వెంకీ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. వెంకీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ కొరకు ఓ హిందీ వెబ్‌సిరీస్‌ లో సందడి చేయనున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇందులో రానా కూడా బాబాయ్ తో పాటుగా హంగామా చేయబోతున్నాడు అంటూ సీక్రెట్ ని రివేల్ చేసేశారు సురేష్ బాబు.  ఏ జోనర్ లో వెబ్ సిరీస్ రాబోతుంది అన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సరికొత్త కథాంశంతో, ఫుల్ గా ఎంటర్టైన్  చేసేందుకు ఈ సిరీస్  రూపుదిద్దుకుంటోంది అని ఆయన అన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సురేష్  బాబు పేర్కొన్నారు. అయితే మొదట హిందీ మరియు తెలుగు భాషల్లో మాత్రమే విడుదల చేయాలనుకున్నా అనంతరం దక్షిణాది భాషలన్నిటింలోనూ ఈ వెబ్ సిరీస్ ను  రిలీజ్  చేయబోతున్నట్లు తెలిపారు.  

అగ్ర హీరో వెంకీ ప్రస్తుతం తెలుగులో ‘దృశ్యం 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలతో బిజీగా ఉండగా వీటి చిత్రీకరణ అనంతరం ఈ వెబ్ సిరీస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీ నటులు ఎవరు అన్న విషయం తెలియదు. కొందరు బాలీవుడ్ నటులు మరియు మరి కొందరు టాలీవుడ్ నటులు ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం వెబ్ సీరీస్ లో కూడా నరప్ప హవా చూపిస్తాడా.



అష్రాఫ్ ఘ‌నీ ఆచూకీ ఎక్క‌డ‌.?

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>