MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advanib693a26c-7919-4638-a322-31910865c2bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advanib693a26c-7919-4638-a322-31910865c2bf-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన 'ధోని అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ కి మొదటి సినిమాతోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే తెలుగులో మరో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ పక్కన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫKiara advani{#}Siddharth;mahesh babu;Remake;raj;bollywood;Kiara Advani;BEAUTY;Ram Charan Teja;prema;Love;Heroine;Nijam;Hero;Tollywood;Cinemaప్రియుడితో సినిమా ఎక్స్ పిరియన్స్ గురించి స్పందించిన కియారా అద్వానీ..!ప్రియుడితో సినిమా ఎక్స్ పిరియన్స్ గురించి స్పందించిన కియారా అద్వానీ..!Kiara advani{#}Siddharth;mahesh babu;Remake;raj;bollywood;Kiara Advani;BEAUTY;Ram Charan Teja;prema;Love;Heroine;Nijam;Hero;Tollywood;CinemaTue, 17 Aug 2021 15:02:00 GMTఅందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన 'ధోని అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ కి  మొదటి సినిమాతోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే తెలుగులో మరో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ పక్కన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ ముంబాయి బాట పట్టింది. అందులో భాగంగానే 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'కబీర్ సింగ్' సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బాస్టర్ అందుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ 'షేర్షా' సినిమాతో జనాల ముందుకు వచ్చింది.

 ఈ సినిమాలో కియారా తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి నటించింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం  చాలా రోజులుగా నడుస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. 'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మొదటి నుండే జనాలలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానిని నిజం చేస్తూ సినిమా విడుదలైన తర్వాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 'షేర్షా' సినిమాలో కియారా తన పాత్ర గురించి మాట్లాడుతూ నేను ఇందులో చేసిన డింపుల్ పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఒక వీరుడికి ప్రేయసి గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు నాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి అని తెలియజేసింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా తో నటించడం గురించి కియారా అద్వాని మాట్లాడుతూ . మంచి నటుడితో కలిసి నటిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని వివరించింది.



క్యూట్ లుక్స్ ఇస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో చెప్పండి

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>