PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpgఅమరావతి : స్కూళ్లలో కరోనా టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని... ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని..వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చరcovid 19 {#}SV Mohan Reddy;CM;Jagan;Andhra Pradesh;Telangana Chief Minister;Coronavirusస్కూల్స్ లో కరోనా పరీక్షలు : సిఎం జగన్స్కూల్స్ లో కరోనా పరీక్షలు : సిఎం జగన్covid 19 {#}SV Mohan Reddy;CM;Jagan;Andhra Pradesh;Telangana Chief Minister;CoronavirusTue, 17 Aug 2021 16:43:29 GMTస్కూళ్లలో కరోనా టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని... ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి అధికారులకు  కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ మహమ్మారి  పరిస్థితుల పై క్యాంపు కార్యాలయం లో సిఎం జగన్  ఈ రోజున కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్   మోహన్ రెడ్డి  మాట్లాడుతూ..  స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటో కాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య శాఖ మార్గ దర్శకాలను పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు సిఎం జగన్. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు..   థర్డ్‌ వేవ్‌ నేపథ్యం లో ముందస్తు గా తీసు కోవాల్సిన చర్యల పైనా సమీక్ష నిర్వహించారు సిఎం జగన్. 

 ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు సిఎం జగన్.   ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు.  తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే... ముందస్తుగా అనుమతి తీసుకోవాలని..  పెళ్లిళ్ల లో 150 మందికే అనుమతి ఉంటుందని  పేర్కొన్నారు సిఎం జగన్.  కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్న సీఎం జగన్.. ఉల్లంఘించే వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలన్న సీఎం.. ఆ తర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించ కూడదన్నారు.  ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.  సమర్థ వంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం రెండు కొత్త వెబ్‌సైట్లు తీసుకు వస్తామన్నారు.  



"వనితా విజయ్ కుమార్" పేరు వెనుకున్న రహస్యమిదే ?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>