PoliticsR.PARMESWAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aap6f259758-3a40-4807-9c75-1de0dfa8cf1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aap6f259758-3a40-4807-9c75-1de0dfa8cf1d-415x250-IndiaHerald.jpgపర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో పాదం మోపేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉత్సాహం చూపుతోంది. అధికార బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు చీపురు పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నా ఇప్పటికే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి మిగిలిన పార్టీలకు సవాల్‌ విసిరింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభల వ్యవధి మార్చి 2022తో ముగియనుంది. అAAP{#}March;Elections;Service;Delhi;vidya;INTERNATIONAL;Telangana Chief Minister;Party;CMఉత్తరాఖండ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీఉత్తరాఖండ్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీAAP{#}March;Elections;Service;Delhi;vidya;INTERNATIONAL;Telangana Chief Minister;Party;CMTue, 17 Aug 2021 19:24:08 GMTపర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో పాదం మోపేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉత్సాహం చూపుతోంది. అధికార బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు చీపురు పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నా ఇప్పటికే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి మిగిలిన పార్టీలకు సవాల్‌ విసిరింది.


70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభల వ్యవధి మార్చి 2022తో ముగియనుంది. అంటే బహుశా జనవరిలో ఎన్నికల షెడ్యూల్‌ రావచ్చు.


రిటైర్డ్‌ కర్నల్‌ అజయ్‌ కొట్యాల్‌   తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ ప్రజలు రాష్ట్రాన్ని దోచుకున్న రాజకీయ నాయకులతో విసిగిపోయారని, ఒక సైనికుడిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఆయన డెహ్రాడూన్‌లో అన్నారు. సైనికుడు సీఎం అయితే తన జేబు నింపుకోవడం కాకుండా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని అన్నారు.   ఆమ్‌ ఆద్మీ పార్టీకి అధికారం ఇస్తే ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని అంతర్జాతీయ హిందూ ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధిపరిచి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. అంతే కాదు తమకు అధికారం ఇస్తే ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్‌ అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఢిల్లీ తరహా పాలన అందిస్తామని, విద్య వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.


ఉత్తరాఖండ్‌లో విస్తరించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ గడిచిన ఏడాది కాలంగా  తీవ్రంగా కృషి చేస్తోంది. గత నెలలోనూ  కేజ్రీవాల్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఉచిత నీళ్లు, విద్యుత్‌ అందించడంతో పాటు స్వచ్ఛ రాజకీయాన్ని అందిస్తామనే భరోసాతో ఉత్తరాఖండ్‌ వాసులకు దగ్గరయ్యే ప్రయత్నం ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తోంది. సైన్యంలో కర్నల్‌గా రిటరైన్ అజయ్‌ కోటియాల్‌ ఉత్తరకాశిలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశారు. 2013లో వరదలతో తల్లడిల్లిన కేదార్‌నాధ్‌ పునఃనిర్మాణంలో కొట్యాల్‌  తీవ్రంగా కృషి చేశారు.




తాలిబ‌న్ల‌పై గెరిల్లా పోరు?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - R.PARMESWAR]]>