MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankar-birthday-hbd-shankar-95a62273-d327-4340-9f70-80c9799a084d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-shankar-birthday-hbd-shankar-95a62273-d327-4340-9f70-80c9799a084d-415x250-IndiaHerald.jpgతన మేకింగ్ నైపుణ్యాలతో సౌత్ సినిమా ప్రమాణాలను పెంచేసిన ప్రముఖ్ తమిళ దర్శకనిర్మాత శంకర్ బర్త్ డే నేడు (ఆగష్టు 17). విజనరీ డైరెక్టర్ శంకర్ పరిచయం అవసరం లేదు. అతను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షోమ్యాన్. భారీ కాన్వాస్‌పై లైఫ్ టైం కంటే పెద్ద చిత్రాలను రూపొందించడంలో శంకర్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. అతని సినిమాలు అన్ని సాంకేతిక విలువలతో వాణిజ్య విలువలతో కూడిన సామాజిక సందేశాన్ని అందిస్తాయి. ఆయన కథ, స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందే వరకు సినిమా ప్రారంభించడు. ఒకసారి సంతృప్తి చెందితే ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరపDirector Shankar Birthday; HBD Shankar;{#}Thriller;Thota Chandrasekhar;shankar;Master;Remake;INTERNATIONAL;Tamil;Ram Charan Teja;Director;Hero;Blockbuster hit;Chitram;Hindi;Industry;Cinemaఇండియన్ సినిమా కా బాప్ఇండియన్ సినిమా కా బాప్Director Shankar Birthday; HBD Shankar;{#}Thriller;Thota Chandrasekhar;shankar;Master;Remake;INTERNATIONAL;Tamil;Ram Charan Teja;Director;Hero;Blockbuster hit;Chitram;Hindi;Industry;CinemaTue, 17 Aug 2021 09:13:12 GMTతన మేకింగ్ నైపుణ్యాలతో సౌత్ సినిమా ప్రమాణాలను పెంచేసిన ప్రముఖ్ తమిళ దర్శకనిర్మాత శంకర్ బర్త్ డే నేడు (ఆగష్టు 17). విజనరీ డైరెక్టర్ శంకర్ పరిచయం అవసరం లేదు. అతను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షోమ్యాన్. భారీ కాన్వాస్‌పై లైఫ్ టైం కంటే పెద్ద చిత్రాలను రూపొందించడంలో శంకర్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. అతని సినిమాలు అన్ని సాంకేతిక విలువలతో వాణిజ్య విలువలతో కూడిన సామాజిక సందేశాన్ని అందిస్తాయి. ఆయన కథ, స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందే వరకు సినిమా ప్రారంభించడు. ఒకసారి సంతృప్తి చెందితే ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరపై అద్భుతాలు సృష్టిస్తుంది. అందుకే అన్నారు విజనరీ డైరెక్టర్ అని. తన మొదటి చిత్రం 'జెంటిల్‌మన్' నుండి '2.0' వరకు శంకర్ ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లతో తన బార్‌ని పెంచుకుంటూ వచ్చారు. ఆయన సినిమాలు చాలా ఖరీదు అంటే... భారీ బడ్జెట్ తప్పదు. పరిశ్రమకు అత్యున్నత సిజిఐని అందించిన ఘనత ఆయనదే.

శంకర్ మొదట్లో ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. తన కెరీర్‌ని "జెంటిల్‌మన్‌"తో ప్రారంభించాడు. ఈ సినిమా సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. తర్వాత "కధలన్, ఇండియన్, జీన్స్ మరియు ముధల్వాన్" అన్నీ మెగా బ్లాక్‌బస్టర్‌లు. అతను హిందీలో "ముధల్వాన్‌"ను "నాయక్: ది రియల్ హీరో"గా రీమేక్ చేశాడు. అతని తదుపరి చిత్రం "బాయ్స్" మ్యూజికల్ బ్లాక్ బస్టర్. సైకిలాజికల్ థ్రిల్లర్ "అన్నియన్" తమిళ్, తెలుగులో "అపరిచితుడు" చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. 2007 లో, అతను శివాజీకి దర్శకత్వం వహించి విడుదల చేసాడు. ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక దర్శకుడిగా ఆయన చేసే విజువల్ వండర్స్ కాకుండా, శంకర్ సహజమైన రీతిలో మానవ భావోద్వేగాలతో కూడిన సినిమాలను నిర్మించడానికి ఇష్టపడతాడు. "కాదల్, కల్లూరి, ఈరమ్" ఒక నిర్మాతగా ఆయన అభిరుచికి సరైన ఉదాహరణలు. "ఇమ్సాయ్ అరసన్ 23 ఎమ్ పులికేసి" వంటి వినోదాత్మకమైన చిత్రాలను కూడా నిర్మిస్తాడు. విజనరీ డైరెక్టర్ శంకర్ సౌత్ సినిమా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచాడు. 'ఇండియన్ 2' తో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో మరోసారి మైమరిపించడానికి అతను సిద్ధమవుతున్నాడు. మరోవైపు రామ్ చరణ్ తో "ఆర్సీ15", "అపరిచితుడు" హిందీ రీమేక్ లతో బిజీగా ఉన్న ఇండస్ట్రీ హిట్ మాస్టర్ మేకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.



ఇండియన్ సినిమా కా బాప్

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>