SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/encounter-dc912f36-42d7-4326-ae79-249f3b013a4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/encounter-dc912f36-42d7-4326-ae79-249f3b013a4b-415x250-IndiaHerald.jpgగుంటూరు రమ్య హత్యోదంతం తరువాత ఎప్పటిలానే తాత్కాలిక భావోద్వేగాలు రేగుతున్నాయి. ఆమెను చంపిన శశికృష్ణను ఎ న్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ మాకొక సజ్జనార్ (హైద్రాబాద్ సిటీ పోలీస్ బాస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్) అంతా గొంతుకలు వి నిపిస్తున్నారు. ఇలాంటి చర్యలు వలన అయినా సమాజంలో మార్పు కోరుకున్నంత వ స్తుంది అని గౌరవ నెటిజన్ల ప్రతిపాదన.encounter {#}Sathwara;Murder.;Shakti;Kanna Lakshminarayana;vehicles;Guntur;ramya;ramya krishnan;Smart phone;V;Manam;Traffic police;police;mediaడిస్కషన్ పాయింట్ : ఎన్కౌంటర్ ఎందుకు సర్?డిస్కషన్ పాయింట్ : ఎన్కౌంటర్ ఎందుకు సర్?encounter {#}Sathwara;Murder.;Shakti;Kanna Lakshminarayana;vehicles;Guntur;ramya;ramya krishnan;Smart phone;V;Manam;Traffic police;police;mediaTue, 17 Aug 2021 12:00:44 GMTరాయి విసరడం సులువు
కానీ విసిరే శక్తే మనుషులకు లేదు


చంపడం సులువు
చావును అడ్డుకునేందుకు చొరవే లేదు


ఘటన జరిగాక రోడ్డు పై అరవడం సులువు
అదే అరుపు హత్య జరుగుతున్న సమయాన
వినిపించదు..ఆ విధంగా ఊహించకూడదు కూడా!


మనుషుల్లో ఉండే కోపాలకు అర్థాలు వేరు
ఉద్వేగాలకూ ఉక్రోషాలకూ అర్థాలే వేరు
చంపడంతో ఒక కథ ముగింపు సాధ్యం కాదు
అదే ప్రారంభం మరో ప్రతికార వాంఛకు



ఫస్ట్ కాజ్ : చంపేద్దామా ?
గుంటూరు రమ్య హత్యోదంతం తరువాత ఎప్పటిలానే తాత్కాలిక భావోద్వేగాలు రేగుతున్నాయి. ఆమెను చంపిన శశికృష్ణను ఎ న్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ మాకొక సజ్జనార్ (హైద్రాబాద్ సిటీ పోలీస్ బాస్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్) అంతా గొంతుకలు వి నిపిస్తున్నారు. ఇలాంటి చర్యలు వలన అయినా సమాజంలో మార్పు కోరుకున్నంత వ స్తుంది అని గౌరవ నెటిజన్ల ప్రతిపాదన.


మంచిని సమాధి చేసేంత శక్తి
సమాజానికి ఉంది అదే స్థాయిలో
చెడునూ, కిరాతకాన్నీ అడ్డుకునే  శక్తి
మాత్రం లేదు..ఈ శక్తి విహీనత
లేదా కాంతి విహీనతనే మనం అడ్డుకోవాలి
చంపేద్దామా సర్..ఇదీ ఇవాళ్టి డిస్కషన్ పాయింట్



రోడ్డుపై వేధింపులు చూశాను.తల్లికి చెప్పుకోలేని ఆడబిడ్డ పోలీసుకు ఎలా చెప్పుకోగలదు. ఈ నిస్సహాయతే రమ్య ప్రాణం తీసింది. అమ్మాయిలూ! మీకు దిశ యాప్ పనిచే స్తుందో లేదో తెలియాలి ముందు. మీ ఫోన్ లో స్టేటస్ ల గోల తరువాత.. ఆ పాటి చొరవ లేకపోతే, ఆలోచన లేకపోతే ఏళ్లకు ఏళ్లు వేధింపులు మోయాల్సిందే. గౌరవ ఇంఛార్జ్ డిఐజీ చెబుతున్న మాట ప్రకారం ఆర్నెల్లుగా మోస్తున్న వేదన ఇది..లేదా భరిస్తున్న వేదన ఇది. ఈ ఆర్నెల్ల వ్యవధిలో పోలీసు సహాయం కోరి ఆమె స్పందించినా, ఆమెపై కి రాతకంగా దాడి జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు స్పందించినా ఓ నిండు ప్రాణానికి భరోసా దక్కేది అన్నది ఆయన అభిప్రాయం. మరి! చంపేయండి అంటారేంటి?



మనుషులను చంపడం సులువు. మార్చడమే కష్టం. పరివర్తన అన్నది సాధ్యం కాకపోయినా చెడు నుంచి మంచికి చేసే ప్రయా ణం ఒకటి చేసేందుకు సహకరించడం ఇంకా కష్టం. మంచిని బతికించే క్షణాల కోసం మనం చేసే పోరాటం ఏంటన్నది అడగడం ఇం కా తప్పు. ఇంతటి ఘోరం జరిగాక కూడా వాడెందుకు బతకాలి? తప్పు.. చంపేయండి ..నెత్తుటి మడుగులోకి తోసేయ్యండి. అరు పులు..తీవ్ర స్వరంతో వినిపిస్తున్న ఈ అరుపులు మన జీవితాలను సంస్కరిస్తాయా? పోనీ ఆ..త రువాత అయినా  ఆడ బిడ్డల మాన,ప్రాణాలకు రక్షణ ఉంటుందా? ఈ ఇంటెన్షన్ ను ఎలా అర్థం చేసుకోవాలి. మనుషుల చావుతో దక్కే పరిష్కారాలు, అవే న్యాయ శాస్త్రాన్ని నిర్దేశిస్తే, అన్నింటికే ఎన్కౌంటర్ ఒక్కటే సమాధానం కావాలి. లేదా ఎన్కౌంటర్ ఒక్కటే  ఉండి మిగతా సెక్షన్లు అన్నీ తొలగించేలా కొత్త శిక్షా స్మృతి రాసుకోవాలి.



ప్రతి అన్యాయం వెనుక
నైతిక పతనం ఉంటుంది
మనుషులు బాధ్యతను
విడిచి మాట్లాడితే కోపం..
ఏ చిన్న తప్పిదాన్నీ  
అడుకోలేని చేతగానితనం
మనలో ఉంటే ఇంకా కోపం




కొవ్వొత్తి వెలుగులలో....
....తొలగని చీకటికి వందనం
రమ్య ఘటననో,మరో ఘటననో జరిగిన వెంటనే మనం రోడ్డు పైకి వస్తాం. ట్రాఫిక్ ను నిలుపుతాం. కొవ్వొత్తుల ర్యాలీ ఎలానూ ఉం టుంది. అటుగా వచ్చే వాహనాలు ఆపి ఈ నిరసన అయ్యే వరకూ వెళ్లొద్దనీ చెప్పగలం. ఇంకా ఏమయినా..ఎంతయినా ఆ కొద్ది సే పు మీ ఇంటెన్షన్ మీడియాకూ, మీ ఇంటెన్షన్ గౌరవ పోలీసుకూ తెలియాలన్న తాప త్రయం. ఇంత వరకూ బాగానే ఉంది. ఈ కో పం, ఈ ఆవేదన మన వీధుల్లో జరిగే ఏ అన్యాయంపైనైనా ఉంటుందా? ఉండదు. మనలో నిజాయితీ ఉండదు. నిబద్ధత ఉండదు. మనం కేవలం ఆ కొద్దిసేపు అరిచాక, మీడియా వెళ్లిపోయాక, మన స్టేటస్ లు అప్ లోడ్ అయిపోయాక మన లౌడ్ వాయిస్ తగ్గిపో తుంది. బరాబర్ తగ్గిపోతుంది. ఎన్కౌంటర్ల కారణంగా మార్పులు వస్తాయి అని అనుకోవడం కన్నా ఇదే సత్వర న్యాయం అని నిర్దే శించడం కన్నా మరొక ప్రత్యామ్నాయం ఏదయినా ఉంటే ఆలోచించాలి.

......ప్రార్థించండి మార్పు కోసం!
కాస్తో కూస్తో! ఫలితం అనుకూలం
చావుకు చావు సమాధానం అవ్వాలని కోరుకుంటే మరి!  మీరు కోరుకునే వ్యవస్థలో నిరంతరం జరగాల్సినవి రాజ్య హత్యలో లేదా వ్యక్తిగత హత్యలో కావాలి. ఆ  రక్తపాతాన్ని మీరు ఊహిం చగలరా? లేదా  నియంత్రించగలరా?  తప్పిదాలను గుర్తించే క్రమం ఒకటి మొదయితే సంస్కరణ సాధ్యం..న్యాయం దక్కాలి. చావు,బతుకుల కొట్లాటలో సమిధ మారే మనుషులంతా కొత్త ప్రపంచం దిక్కు ఆశగా చూస్తుంటారు. వారికి భరోసా దక్కాలి. మనకు క ళ్లకు కనిపించే నిజాలు, వెనుక దాగిపోయిన నిజాలు అన్నింటికీ ఓ పరి ష్కారం..ఓ నిర్థారణ పరీక్షా తప్పని సరి! దేవుడా! ఈ ఉదంతం మరువక మునుపే మాకో మార్గం చూపు..అని ప్రార్థించడంలో బా ధ్యత ఉంది. కనీసం ఆ పని అయినా చేయం డి ప్లీజ్!





మెగా, నందమూరి ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>