MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-know-how-hollywood-is-in-tollywoodde4796e3-d2ff-431b-a3f6-c72d1cf3d456-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-know-how-hollywood-is-in-tollywoodde4796e3-d2ff-431b-a3f6-c72d1cf3d456-415x250-IndiaHerald.jpgఇప్పటి వరకు టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియన్ స్థాయికి వెళ్లడం చూశాం. కానీ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అచ్చం అవే ఎఫెక్ట్.. అవే ఎమోషన్ గ్రాఫిక్స్ తో అద్భుతం సృష్టించేందుకు సిద్ధమయ్యారు తెలుగు మేకర్స్. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్ ను తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. Do you know how Hollywood is in Tollywood{#}uyyalawada narasimha reddy;Rajamouli;Master;Darsakudu;akhil akkineni;Hollywood;Joseph Vijay;Director;vijay deverakonda;Tollywood;Chiranjeevi;Cinemaటాలీవుడ్ లో హాలీవుడ్.. ఎలాగో తెలుసా..!టాలీవుడ్ లో హాలీవుడ్.. ఎలాగో తెలుసా..!Do you know how Hollywood is in Tollywood{#}uyyalawada narasimha reddy;Rajamouli;Master;Darsakudu;akhil akkineni;Hollywood;Joseph Vijay;Director;vijay deverakonda;Tollywood;Chiranjeevi;CinemaTue, 17 Aug 2021 12:00:00 GMTఅక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీకి ఫస్ట్ లుక్ తోనే హైప్స్ క్రియేట్ అయ్యాయి. మజిల్డ్ బాడీతో విడుదలైన పోస్టర్స్ వైరల్ అయ్యాయి. ఈ అంచనాలని తర్వాతి స్థాయికి తీసుకెళ్లేందుకు హాలీవుడ్‌ నుంచి స్టంట్‌ డైరెక్టర్స్‌ని తీసుకొస్తున్నాడట సురేందర్ రెడ్డి. 'ఏజెంట్' బాక్సాఫీస్ మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కావాలంటే యాక్షన్‌ సీన్స్ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండాలనుకుంటున్నాడట దర్శకుడు. అందుకే విదేశాల నుంచి స్టంట్‌ మాస్టర్స్‌ వస్తున్నారని చెబుతున్నారు.  

విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్న సినిమా 'లైగర్'. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు రౌడీ. అందుకే 200 కోట్ల ఓటీటీ ఆఫర్‌ కూడా చాలా చిన్నదని పోస్ట్‌ పెట్టాడు. ఇక విజయ్ ఇంత హోప్స్‌ పెట్టుకున్న ఈ సినిమాని అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్.

వరుణ్‌తేజ్ ఫిజికల్‌గా చాలా కష్టపడి చేస్తోన్న సినిమా 'గని'. బాక్సింగ్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాని హాలీవుడ్‌ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. ఇక ఈ ఆలోచనలకి తగ్గట్లుగానే 'గని' సినిమా కోసం హాలీవుడ్‌ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టావల్, వ్లాద్‌ రింబర్గ్‌ని తీసుకొచ్చారు. ఓటీటీ మార్కెట్‌ విస్తరించాక ఆడియన్స్‌కి వరల్డ్‌ క్లాస్‌ కంటెంట్‌ అందుబాటులోకి వచ్చేసింది. భాషతో పనిలేకుండా కొరియన్ డ్రామాలు కూడా చూస్తున్నారు. ఆ హైప్స్‌ని మ్యాచ్‌ చెయ్యడానికే హాలీవుడ్‌ నుంచి స్టంట్ డైరెక్టర్స్‌ని తీసుకొస్తున్నారు మేకర్స్.

'బాహుబలి' తర్వాత రాజమౌళి ఆలోచనలు నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. 'ట్రిపుల్ ఆర్' తర్వాత జక్కన్న వరల్డ్‌ క్లాస్ పిక్చర్ తీస్తాడని చాలా రోజల నుంచి ప్రచారం జరుగుతోంది. వాటికి బలమిస్తూ 'ట్రిపుల్ ఆర్' నుంచే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని ఫోకస్ చేస్తున్నాడు జక్కన్న. ఈ హిస్టారికల్ డ్రామాకి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా నిక్‌ పావెల్‌ని తీసుకొచ్చాడు. 'గ్లాడియేటర్, ది బౌర్న్ ఐడెంటిటి' లాంటి మూవీస్‌కి వర్క్‌ చేశాడు నిక్ పావెల్.

చిరంజీవి చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని చేసిన సినిమా 'సైరా'. తొలితరం స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. కథ నుంచి రిలీజ్ వరకు చిరు మెగా ఇంట్రెస్ట్‌ పెట్టిన ఈ మూవీకి గ్రెగ్‌ పావెల్ స్టంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ బ్రిటన్ స్టంట్‌ మాస్టర్ 'విల్లో, సహారా' లాంటి సినిమాలకి వర్క్ చేశాడు. మొత్తానికి టాలీవుడ్ లో హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు.





బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు సజీవ దహనం

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>