PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-odisha8e6ea608-5196-4ad2-a22e-e5fd34f13487-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-odisha8e6ea608-5196-4ad2-a22e-e5fd34f13487-415x250-IndiaHerald.jpgదేశంలో మరో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. ఇప్పటికే అసోమ్, మిజోరాం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా... ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాలు తమవంటే తమవే అంటూ... ఇప్పటికే అసోమ్, మిజారాం రాష్ట్రాలు తన్నుకుంటుంటే... ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య గ్రామాలు మావంటే... కాదు మావని కొట్టుకుంటున్నారు. ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు అయితే మరో అడుగు ముందుకు వేశారు కూడా. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్లిన ఏపీ అధికారులను అAP Odisha{#}mandalam;District;Odisha;MP;Andhra Pradesh;MLA;Congress;Bharatiya Janata Partyఒడిశాలో ఏపీ అధికారులకు నో ఎంట్రీఒడిశాలో ఏపీ అధికారులకు నో ఎంట్రీAP Odisha{#}mandalam;District;Odisha;MP;Andhra Pradesh;MLA;Congress;Bharatiya Janata PartyTue, 17 Aug 2021 10:40:34 GMTదేశంలో మరో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. ఇప్పటికే అసోమ్, మిజోరాం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా... ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాలు తమవంటే తమవే అంటూ... ఇప్పటికే అసోమ్, మిజారాం రాష్ట్రాలు తన్నుకుంటుంటే... ఇప్పుడు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య గ్రామాలు మావంటే... కాదు మావని కొట్టుకుంటున్నారు. ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు అయితే మరో అడుగు ముందుకు వేశారు కూడా. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్లిన ఏపీ అధికారులను అడ్డుకోవడమే కాకుండా నానా యాగి చేశారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రామాల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అధికారులు అక్కడికి చేరుకున్నారు. మనబడి నాడు-నేడు రెండవ దశ పనుల శంకుస్థాపనకు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు... ఏపీ అధికారులను అడ్డుకున్నారు. ఒడిశాకు చెందిన పొట్టంగి, కొరాపుట్, జయపురం ఎమ్మెల్యేలు ప్రీతమ్ పాఢి, రఘురామ్ పడాల్, తారా ప్రసాద్. బీజేపీ మాజీ ఎంపీ జయరాం పంగితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. సరిహద్దులోని హర్మాడగి సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అటు ఇటు ఎలాంటి రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాలకు చెందిన ఏపీ ప్రభుత్వ అధికారులతో పాటు ఐటీడీఏ అధికారులను కూడా అడ్డుకున్నారు. గ్రామాల్లోకి వస్తే తిరిగి వెళ్లేది లేదని వార్నింగ్ ఇచ్చారు కూడా. అధికారుల చేతుల్లో పుస్తకాలు లాక్కుని చింపేశారు. విషయం తెలుసుకున్న ఏపీ ఉన్నతాధికారులు, ఐటీడీఏ పీవో, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారితో చర్చించేందుకు ఒడిశా అధికారులు ఏ మాత్రం సుముఖత చూపటం లేదు. ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రస్తుతం సరిహద్దు వైపు ఎవరూ వెళ్లవద్దంటూ ఏపీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.





పెట్రో స్పీక్స్ : నేరం నాది కాదు ! నిర్మలమయిన మనసు

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>