MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-kapoorf6eeea3e-8c31-4fb1-9da7-c85b68df0ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-kapoorf6eeea3e-8c31-4fb1-9da7-c85b68df0ff0-415x250-IndiaHerald.jpgజాన్వి అడుగులు ఎటు వైపు..? అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్‌లో త్వరలో ఎంట్రీ కాబోతుందని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఇంకా ఎంటర్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శ్రీదేవి కూతురు జాన్వికపూర్ నటించాలని అప్పట్లో చిరంజీవి ఆకాంక్షించారు. అయితే, ఆ మాటలు ఆచరణలోకి రాలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్‌గా జాన్వి ఫjhanvi kapoor{#}jahnavi;Sridevi Kapoor;Janhvi Kapoor;Chiranjeevi;Ram Charan Teja;Rajani kanth;Nijam;Pooja Hegde;Cinema;Allu Arjun;News;Director;sriram;Tollywood;bollywood;bhama;Remake;Karan Johar;Hero;CBNజాన్వి అడుగులు ఎటు వైపు..?జాన్వి అడుగులు ఎటు వైపు..?jhanvi kapoor{#}jahnavi;Sridevi Kapoor;Janhvi Kapoor;Chiranjeevi;Ram Charan Teja;Rajani kanth;Nijam;Pooja Hegde;Cinema;Allu Arjun;News;Director;sriram;Tollywood;bollywood;bhama;Remake;Karan Johar;Hero;CBNTue, 17 Aug 2021 17:00:00 GMTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్‌లో త్వరలో ఎంట్రీ కాబోతుందని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఇంకా ఎంటర్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శ్రీదేవి కూతురు జాన్వికపూర్ నటించాలని అప్పట్లో చిరంజీవి ఆకాంక్షించారు. అయితే, ఆ మాటలు ఆచరణలోకి రాలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్‌గా జాన్వి ఫైనల్ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ, అవి నిజం కాదని ఇటీవల తేలింది.

సూపర్ స్టార్ మహేశ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫైనల్ అయినట్లు మూవీ యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీ సరసన జాన్వి నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే ‘ఐకాన్’ ఫిల్మ్‌లో బన్నీ సరసన జాన్వికపూర్ ఎంపికయినట్లు వార్తలొస్తున్నాయి.
అయితే, చాలా రోజుల నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వి కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి టాలీవుడ్‌లో సత్తా చాటిన తర్వాతనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వగా, జాన్వి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రజెంట్ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ‘రూహి’ సినిమాలో జాన్వి నటకుగాను విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ను హిందీలో రీమేక్ చేయాలని మేకర్స్ భావిస్తుండగా, ఇందులో లీడ్ రోల్‌ను జాన్వికపూర్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ డైరెక్షన్‌లో వస్తున్న ‘దోస్తానా 2’లోనూ జాన్వి నటిస్తున్నది.  టాలీవుడ్‌లో ఏ హీరో ద్వారా ఎంట్రీ ఇస్తుందో ఈ భామ మరి చూడాలి. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, మహేశ్ బాబు సినిమాల్లో చాన్స్ రాకపోగా, అల్లు అర్జున్ సినిమాతోనైనా జాన్వి ఎంట్రీ ఇచ్చేనా? చూడాలి..


'రచ్చబండ'తో జగన్ మరో మాయ చేయనున్నాడా ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>