PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-first-arrest6d2ac3ef-1355-4afc-a2fc-302992cdcfc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-first-arrest6d2ac3ef-1355-4afc-a2fc-302992cdcfc2-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ పొలిటికల్‌ కెరీర్‌లో తొలిసారిగా అరెస్ట్‌ అయ్యారు. గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్‌సహా మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్రలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తొలుత రమ్యశ్రీ ఇంటికి లోకేశ్‌ వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు.lokesh first arrest{#}ramya;ramya krishnan;Telangana Chief Minister;MLA;Arrest;TDP;Party;Minister;police;News;YCPలోకేశ్‌ పొలిటికల్ కెరీర్‌లోనే ఫస్ట్ అరెస్ట్లోకేశ్‌ పొలిటికల్ కెరీర్‌లోనే ఫస్ట్ అరెస్ట్lokesh first arrest{#}ramya;ramya krishnan;Telangana Chief Minister;MLA;Arrest;TDP;Party;Minister;police;News;YCPMon, 16 Aug 2021 17:12:00 GMTతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ పొలిటికల్‌ కెరీర్‌లో తొలిసారిగా అరెస్ట్‌ అయ్యారు. గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్‌సహా మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్రలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

తొలుత రమ్యశ్రీ ఇంటికి లోకేశ్‌ వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబీకులను లోకేశ్‌ పరామర్శిస్తున్న సమయంలోనే వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. రమ్యశ్రీ ఇంట్లో లోకేశ్‌తోపాటు టీడీపీ సీనియర్‌ నాయకులు ఉండగానే వచ్చిన వైసీపీ నాయకులను పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.

తాము ముందస్తుగా సమాచారం ఇచ్చి పరామర్శకు వచ్చిన సమయంలోనే వైసీపీ నాయకులను అనుమతించడం ఏమిటి? అని టీడీపీ  నాయకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆలపాటి రాజాను కింద పడేశారు.  నక్కా ఆనంద్‌బాబుపై రూరల్‌ ఎస్పీ ఏకంగా చేయి చేసుకున్నారు.  నరేంద్రను లారీలోకి విసిరి పడేశారు.
పోలీసుల తీరుపై నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాగ్వాదానికి దిగారు. రమ్య ఇంటికి పరామర్శ కోసం వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడి చేయడం, పోలీసులు కూడా వత్తాసు పలకడం బాధాకరమన్నారు... జగన్‌ చేతగానితనం వల్లే   మహిళలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇతరులకు ఎలా న్యాయం చేస్తారు? అని లోకేశ్‌ ప్రశ్నించారు. మొత్తంమీద లోకేశ్‌ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారిగా అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.



మెహర్ రమేష్ పై అంత నమ్మకమేంటి చిరు!!

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>