MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-pawanff6d0216-ab2f-4073-874e-44b6208b4713-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-pawanff6d0216-ab2f-4073-874e-44b6208b4713-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బిగ్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఒకే సారి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు ఒకేసారి రెండు పండుగలు చేసుకోబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇద్దరి సినిమాలు విడుదల కాబోతుండగా, రెండు సినిమాలు సూపర్ హిట్ అయి ఇండస్ట్రీలో సుహృద్భావ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉండాలని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మేకర్స్ ఈ చిత్రాల విడుతల తేదీలను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘mahesh babu pawan{#}Rajani kanth;Daggubati Venkateswara Rao;Pawan Kalyan;producer;Producer;police;Chitram;CBN;Tollywood;trivikram srinivas;Director;Venkatesh;Makar Sakranti;Cinema;Teluguమహేశ్ వర్సెస్ పవన్.. ఆ సినిమాలపై భారీ హైప్?మహేశ్ వర్సెస్ పవన్.. ఆ సినిమాలపై భారీ హైప్?mahesh babu pawan{#}Rajani kanth;Daggubati Venkateswara Rao;Pawan Kalyan;producer;Producer;police;Chitram;CBN;Tollywood;trivikram srinivas;Director;Venkatesh;Makar Sakranti;Cinema;TeluguMon, 16 Aug 2021 12:00:00 GMTటాలీవుడ్ బిగ్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఒకే సారి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు ఒకేసారి రెండు పండుగలు చేసుకోబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇద్దరి సినిమాలు విడుదల కాబోతుండగా, రెండు సినిమాలు సూపర్ హిట్ అయి ఇండస్ట్రీలో సుహృద్భావ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉండాలని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మేకర్స్ ఈ చిత్రాల విడుతల తేదీలను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. 

ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవర్ పోలీసు ఆఫీసర్‌గా పవన్ కనిపించారు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ఇటీవల విడుదలయ్యాయి. ‘భీమ్లానాయక్’ టైటిల్ రోల్‌లో పవన్ కనిపించనుండగా, డానియల్ శేఖర్‌గా దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర టీజర్ కూడా ఇటీవల విడుదల కాగా, మహేశ్ ఇందులో బ్యాంకర్‌గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ‘భీమ్లానాయక్’ సినిమాతో పాటు మహేశ్ ‘సర్కారు వారి పాట’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.థమన్ ఉండటం విశేషం.

గతంలో పవన్, మహేవ్ సినిమాలు ఒకేసారి రీలీజైన సందర్భాలు ఉన్నాయి. పవన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం 1999 జూలై 15న విడుదల కాగా, మహేశ్ ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు’అదే నెల 30న విడుదలైంది. ఇక ఆ తర్వాత ఏడాది మహేశ్ ‘యువరాజు’, పవన్ ‘బద్రి’ ఒకే నెలలో విడుదలయ్యాయి. ‘పోకిరి, బంగారం’ సినిమాలు కూడా ఒకే నెలలో విడుదలయ్యాయి. కాగా, ఈ సారి అనగా వచ్చే ఏడాది మళ్లీ ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.  ఈ సారి ఎవరి సినిమా బాగుంటుందో? అన్న చర్చ అభిమానుల్లో ఉండగా, రెండూ హిట్ అయితే బాగుంటుందని, ఇండస్ట్రీలో మంచి వాతావరణం నెలకొంటుందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



ఫ్రీ పెట్రోల్.. తిరంగ యాత్రలో తొక్కిసలాట?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>