MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bheemla-nayak-vs-puspa36ee86d0-a7d5-4365-b4aa-248b8953e031-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bheemla-nayak-vs-puspa36ee86d0-a7d5-4365-b4aa-248b8953e031-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా మొదలైపోయింది. పవన్ తాజా చిత్రానికి 'భీమ్లా నాయక్' టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుం కోషియం' కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఇంకో వైపు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కా మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. BHEEMLA NAYAK VS PUSPA{#}raj;you tube;Driver;Master;Allu Arjun;rana daggubati;kalyan;Remake;India;Mass;Telugu;Cinema;Tollywoodఅల్లుడు అదుర్స్ .. : భీమ్లా ఓటూ బ‌న్నీకే !అల్లుడు అదుర్స్ .. : భీమ్లా ఓటూ బ‌న్నీకే !BHEEMLA NAYAK VS PUSPA{#}raj;you tube;Driver;Master;Allu Arjun;rana daggubati;kalyan;Remake;India;Mass;Telugu;Cinema;TollywoodMon, 16 Aug 2021 19:47:21 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా మొదలైపోయింది. పవన్ తాజా చిత్రానికి 'భీమ్లా నాయక్' టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుం కోషియం' కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఇంకో వైపు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కా మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ స్మగ్లర్ పుష్ప రాజ్ రోల్ లో నటిస్తున్న బన్నీ మాస్ ప్రేక్షకులనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఎక్కడ చసుయినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోందంటే అర్ధం చేసుకోండి. ఎంతలా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు బన్నీ అభిమానులు.

సినిమా ఒక వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకోవడం, షూటింగ్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం మరియు ఇందులో అల్లు అర్జున్ వేషధారణ మాట్లాడే స్లాంగ్ ఇవన్నీ కలిపి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మొన్ననే విడుదలయిన "దాక్కో దాక్కో మేక..." సాంగ్ కి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యూట్యూబ్ లో ట్రేండింగ్ లో నడుస్తోంది. ఈ సినిమాను లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకుని డీల్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ మూవీతో బన్నీ మూవీని పోలుస్తూ ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు 'భీమ్లా నాయక్' సినిమా నుండి విడుదలయిన ఒక టీజర్ లో పెద్దగా విషయమేమీ లేకపోవడమేనని తెలుస్తోంది.

ఒరిజినల్ సినిమాలో పాత్రకు ఈ పాత్రకు పెద్దగా సెట్ అవలేదని, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెంచుకువడం కోసమే ఈ టీజర్ అన్నట్లు ఉందని సెటైర్లు పేలుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రానా పాత్రను రివీల్ చేయకపోవడం  మరో రచ్చకు తెరలేపింది. ఇలా ఏ విషయంలో చూసుకున్నా బన్నీ పుష్ప మూవీ అందనంత ఎత్తులో ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. త్వరలోనే విడుదల కానున్న పుష్ప మూవీ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం బన్నీ పుష్ప మూవీకే సపోర్ట్ చేస్తుండడం విశేషం. మరి ఆన్ స్క్రీన్ పై ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.



బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>