Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pelli926026b9-ce3a-41b4-9139-b1763e232e75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pelli926026b9-ce3a-41b4-9139-b1763e232e75-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరైనా సరే తాము ప్రేమించిన వ్యక్తినీ ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రేమించిన వాడి తో పెళ్లి జరిగితే అంతకంటే ఇక జీవితంలో ఇంకేం వద్దు అని అనుకుంటారు. కానీ తాము ప్రేమించిన వ్యక్తిని ఏకంగా మరో మహిళతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరూ. ఇక అలాంటి పరిస్థితి వస్తే ఎంతకైనా తెగించ డానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా ప్రేమించిన యువకుడిని మరో మహిళతో కలిసి పంచుకునేందుకు సిద్ధమైంది. ప్రేమించిన యువకుడు తనకు తెలియకుండా వేPelli{#}marriageప్రియుడి పెళ్లి ఆపేందుకు వచ్చిన యువతి.. అంతలో క్రేజీ డెసిషన్?ప్రియుడి పెళ్లి ఆపేందుకు వచ్చిన యువతి.. అంతలో క్రేజీ డెసిషన్?Pelli{#}marriageMon, 16 Aug 2021 09:30:00 GMTసాధారణంగా ఎవరైనా సరే తాము ప్రేమించిన వ్యక్తినీ ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రేమించిన వాడి తో పెళ్లి జరిగితే అంతకంటే ఇక జీవితంలో ఇంకేం వద్దు  అని అనుకుంటారు. కానీ తాము ప్రేమించిన వ్యక్తిని ఏకంగా మరో మహిళతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరూ. ఇక అలాంటి పరిస్థితి వస్తే ఎంతకైనా తెగించ డానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా ప్రేమించిన యువకుడిని మరో మహిళతో కలిసి పంచుకునేందుకు సిద్ధమైంది.


 ప్రేమించిన యువకుడు తనకు తెలియకుండా వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు అనే విషయం ఆ మహిళకు తెలిసింది.  ఈ క్రమంలోనే ఇక పెళ్లి జరుగుతున్న కల్యాణ మండపానికి చేరుకుని అక్కడికి వెళ్లి ప్రియుడి పెళ్లి ఆపేసింది. కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా తన ప్రియుడిని మరో మహిళతో కలిసి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఘటన  ఇండోనేషియాలో వెలుగులోకి వచ్చింది . సెంట్రల్ లొంబోకు కి చెందిన కోరిక అక్బర్ అనే 20 ఏళ్ల యువకుడు కి కోటిమా అనే  యువతితో కొద్ది రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయగా ఇక బంధుమిత్రుల సమక్షంలో  పెళ్లి ఘనంగా జరుగుతుంది


 కానీ అంతలో ఆ యువకుడి ప్రియురాలు అక్కడ ప్రత్యక్షమైంది. ముందుగా తనను ప్రేమించాడని ఇప్పుడు వేరే యువతిని  ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రశ్నించింది. ముందుగా తనతోనే సంబంధం ఉంది కాబట్టి తననే భార్యగా గుర్తించాలి అంటూ డిమాండ్ చేసింది. దీంతో అక్కడున్న వారందరూ అయోమయంలో పడిపోయారు. ఇక ఆ తర్వాత కొంత సమయంపాటు చర్చించి ఇక ఇద్దరు యువతులను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆ యువకుడిని ఒప్పించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ప్రియుడి పెళ్లి ఆపేందుకు వచ్చిన యువతి మరో యువతితో కలిసి ప్రియుడిని పెళ్లి చేసుకోవడం మాత్రం కాస్త క్రేజీ అనే చెప్పాలి.



ప్రియుడి పెళ్లి ఆపేందుకు వచ్చిన యువతి.. అంతలో క్రేజీ డెసిషన్?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>