MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cirube5ec812-4731-4c52-a7fd-26904e76b393-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cirube5ec812-4731-4c52-a7fd-26904e76b393-415x250-IndiaHerald.jpgచిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఖైదీ. 1983లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటిదాకా ఉన్న రికార్డులను కూడా చెరిపేసింది. సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ సరికొత్త నిర్వచనం కూడా చెప్పిన మూవీ ఖైదీ. ciru{#}Chiranjeeviఖైదీ హోరులో బాగా నష్టపోయిన చిరు.... ?ఖైదీ హోరులో బాగా నష్టపోయిన చిరు.... ?ciru{#}ChiranjeeviMon, 16 Aug 2021 20:00:00 GMTచిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఖైదీ. 1983లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటిదాకా ఉన్న రికార్డులను కూడా చెరిపేసింది. సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ సరికొత్త నిర్వచనం కూడా చెప్పిన మూవీ ఖైదీ.

ఖైదీతో చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది. చిరంజీవి ఆ తరువాత టాలీవుడ్ లో జైత్ర యాత్రే చేశారు. అయితే ఖైదీ అలా థియేటర్లలో అదరగొడుతూండగా బాపు దర్శకత్వంలో మంత్రి గారి వియ్యకుడు అన్న సినిమాను రిలీజ్ చేశారు. ఖైదీ విడుదలైన అయిన పది రోజుల తేడాలో వచ్చిన ఈ మూవీ అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.

నిజానికి మంత్రిగారి వియ్యంకుడు మూవీలో చిరంజీవి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు బాబ్జీ. ఒక సాధారణ యువకుడిగా ఈ సినిమాలో చిరు చూపించిన నటన హైలెట్ గా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్ గా కూడా చిరు కనిపించి నాటి యూత్ ని అట్రాక్ట్ చేశారు. ఈ మూవీలో ఇళయరాజా మ్యూజిక్ కి చిరంజీవి చేసిన డ్యాన్సులు ఊపేస్తాయి. కధతో పాటుగా సాగే పాత్ర ఆయనది.

ఇలా కధనం, మాటలు, డ్రామా అన్నీ సమపాళ్ళలో ఈ మూవీలో కుదిరినా కూడా పెద్దగా ఆడకపోవడానికి కారణం కూడా చిరంజీవే అని అంటారు. అప్పటికే ఖైదీ వంటి మాస్ మూవీతో జనాలను మెస్మరైజ్ చేసిన చిరంజీవి ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా సాదాసీదా పాత్రలో కనిపించేసరికి జనాలకు చప్పగా అనిపించింది. అంటే ఖైదీ హోరులో ఈ మూవీ కొట్టుకుపోయింది అని చెప్పాలి. ఆ తరువాత టీవీలలో ఎన్నో సార్లు ఈ మూవీ వచ్చింది. ఈ మూవీని బుల్లి తెర మీద ఎంజాయ్ చేయని వారు లేరు. మంచి పాటలు, చక్కని సినిమా ఎందుకు ఆడలేదు అనే ఇప్పటికీ ఫ్యాన్స్ బాధపడతారు కానీ ఖైదీ ఇమేజ్ సామాన్యమా. అందుకే బాబ్జీ అక్కడ తేలిపోయాడు. అలా మరో బ్లాక్ బస్టర్ హిట్ కోల్పోయి చిరంజీవి నష్టపోయాడనే చెప్పాలి.






బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>