PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/schoola7ea098c-3aa7-469b-8e6f-c3ff956d6815-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/schoola7ea098c-3aa7-469b-8e6f-c3ff956d6815-415x250-IndiaHerald.jpgమళ్లీ బడులు మొదలవుతున్నాయి. మళ్లీ ఫీజులు జులుం మొదలవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎన్నో రెట్లు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్య అంతంత మాత్రంగానే ఉన్నా.. ఫీజులు మాత్రం మోత మోగిపోతుంటాయి. దీనికి తోడు ఇప్పుడు కరోనా కారణంగా చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఆన్ లైన్ క్లాసుల పేరుతో మూడు, నాలుగు క్లాసులు నడిపించడం.. ఒకరిద్దరు టీచర్లతో పాఠాలు లాగించడం ఇదీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాల్లో సాగుతున్న తంతు. మరి ఖర్చులు తగ్గినా.. టీచర్ల సంఖ్య తగ్గినా.. పాఠశాల ఫీజుల్లschool{#}Parents;vidya;School;Coronavirusస్కూల్‌ రక్కసి: చదువు తక్కువ.. ఫీజులెక్కువ..?స్కూల్‌ రక్కసి: చదువు తక్కువ.. ఫీజులెక్కువ..?school{#}Parents;vidya;School;CoronavirusMon, 16 Aug 2021 10:13:00 GMTమళ్లీ బడులు మొదలవుతున్నాయి. మళ్లీ ఫీజులు జులుం మొదలవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎన్నో రెట్లు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్య అంతంత మాత్రంగానే ఉన్నా.. ఫీజులు మాత్రం మోత మోగిపోతుంటాయి. దీనికి తోడు ఇప్పుడు కరోనా కారణంగా చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఆన్ లైన్ క్లాసుల పేరుతో మూడు, నాలుగు క్లాసులు నడిపించడం.. ఒకరిద్దరు టీచర్లతో పాఠాలు లాగించడం ఇదీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాల్లో సాగుతున్న తంతు.


మరి ఖర్చులు తగ్గినా.. టీచర్ల సంఖ్య తగ్గినా.. పాఠశాల ఫీజుల్లో మాత్రం తగ్గింపులు ఉండవు. ఇలా కరోనా పేరుతో విద్యార్ధులు నష్టపోయారు.. ఉపాధి కోల్పోయి కొందరు ప్రైవేటు టీచర్లు నష్టపోయారు.. కానీ..స్కూల్స్ నష్టపోయింది తక్కువ. ఈ పాఠశాలలు  పిల్లల దగ్గర ఫీజులు బ్రహ్మాండంగా  తీసుకుంటున్నారు.. పిల్లల దగ్గర మొత్తం వసూలు చేసినా టీచర్లకు ఇచ్చేది మాత్రం సగం జీతమే. ఫీజుల గురించి ఫిర్యాదు చేస్తే.. కావాలంటే టీసీ తీసుకొని వెళ్లొచ్చంటారు కానీ.. తగ్గించే ప్రసక్తే ఉండదు. కరోనా వేళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయంటే.. ఈ ప్రైవేటు స్కూళ్ల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


పోనీ.. ఫీజుల రూపంలో డబ్బు చెల్లించినా.. అందుకు తగ్గ ఫలితం ఉంటుందా అంటే.. సంతృప్తికరమైన సమాధానం రానే రాదు.. పాన్ షాప్ కంటే అధ్వాన్నంగా, ఒక బార్ కంటే వైన్ షాప్ కంటే అధ్వాన్నంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ స్కూల్స్ స్థాపిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. పాఠశాలలకు ఉండాల్సిన కనీస వసతులు ఉండవు.  ప్లే గ్రౌండ్ అనేది ఓ డ్రీమ్.


తమ పిల్లలను ర్యాంకర్లుగా చూడాలనుకునే తల్లిదండ్రులు ఆశలే ఈ దోపిడీ స్కూళ్ల పెట్టుబడి.. అందుకు తగ్గట్లుగానే ప్రచారం సాగుతుంటుంది. కొందరు బాగా మార్కులు వచ్చే వాళ్లకు కాస్త ఆశచూపి తమ వద్ద చేర్చుకుని.. ఆ ఫోటోలతో చేసే ప్రచారమే ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఈ ప్రచారాల మాయలో పడిపోకుండా.. ఆ పాఠశాల గురించి స్వయంగా తెలుసుకోవాలి.. అక్కడి పరిస్థితులను అంచనా వేసుకోవాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం ఆ మాత్రం శ్రద్ద తీసుకోవాలి.





ప్రధాన మంత్రి రాజీనామా.. పరిస్థితులు అధ్వాన్నం..!

జగన్ మార్చిన.. మార్చబోతున్న గ్రామ స్వరూపం..!?

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>