PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/govt-schools5828915b-9710-47b5-ba61-6a43ce7302bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/govt-schools5828915b-9710-47b5-ba61-6a43ce7302bd-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా గతేడాది మార్చి 20 నుంచి మూతపడిన పాఠశాలలు ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా పూర్తిగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు... నేటి నుంచి బడి బాట పట్టాల్సి ఉంది. అయితే అందరి మదిలో ఒకటే ప్రశ్న. అసలు బడి సాధ్యమేనా... పూర్తిస్థాయిలో పాఠశాలలు నిర్వహణ కొనసాగుతుందా... పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా... పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదా... ఇవే ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల మదిలో మెదులుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్... తమ పిల్లలను బడికి పంపేందుకు సంశయిస్తున్నారSchools{#}February;Smart phone;Andhra Pradesh;Educational institutions;Parents;Jagan;March;Coronavirusఈ రోజు నుంచి బడి సాధ్యమేనా..?ఈ రోజు నుంచి బడి సాధ్యమేనా..?Schools{#}February;Smart phone;Andhra Pradesh;Educational institutions;Parents;Jagan;March;CoronavirusMon, 16 Aug 2021 06:22:00 GMTకరోనా కారణంగా గతేడాది మార్చి 20 నుంచి మూతపడిన పాఠశాలలు ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా పూర్తిగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు... నేటి నుంచి బడి బాట పట్టాల్సి ఉంది. అయితే అందరి మదిలో ఒకటే ప్రశ్న. అసలు బడి సాధ్యమేనా... పూర్తిస్థాయిలో పాఠశాలలు నిర్వహణ కొనసాగుతుందా... పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా... పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదా... ఇవే ప్రశ్నలు ఇప్పుడు తల్లిదండ్రుల మదిలో మెదులుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్... తమ పిల్లలను బడికి పంపేందుకు సంశయిస్తున్నారు కూడా.

కొవిడ్ మహమ్మారితో విద్యాసంస్థలు అన్ని మూతపడ్డాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రైవేటు సంస్థలు కూడా ఆన్ లైన్ విధానంలోనే పాఠాలను బోధించాయి. ఫస్ట్ వేవ్ లో కేసులు తగ్గుముఖం పట్టడంతో... ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పాఠశాలలు ప్రారంభించారు. ఓ రెండు నెలల పాటు పిల్లలంతా సెల్ ఫోన్ లు వదిలేసి... టీచర్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా  విన్నారు కూడా. కానీ సెకండ్ వేవ్ రావడంతో... మళ్లీ ఆన్ లైన్ క్లాసులే ఉత్తమమని తల్లిదండ్రులు, పాఠశాలలు భావించడంతో... సెల్ ఫోన్ చదువులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రతి రోజు 2 వేల లోపు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు మళ్లీ పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇందుకు తగినట్లుగానే బెంగళూరు నగరంలో వారం రోజుల్లోనే ఇప్పటికే 500 మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో హై అలర్ట్ కూడా ప్రకటించింది కర్ణాటక సర్కార్. అటు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు పిల్లలను పంపడం ఎంతవరకు క్షేమమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి పాఠశాలలు కొనసాగుతాయా... లేదా అనే మరో  వారం ఆగితే తప్ప క్లారిటీ రాదు.





ప్రచారం కోసమే అంటున్న విపక్షాలు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>