PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/with-the-taliban-occupation-our-pockets-are-empty61608559-82d9-453a-8954-06d70abb534a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/with-the-taliban-occupation-our-pockets-are-empty61608559-82d9-453a-8954-06d70abb534a-415x250-IndiaHerald.jpgతాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను అయితే ఆక్రమించేశారు. అధికార పీఠం మీద కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకూ ఒక లెక్కా.. ఇప్పుడు మరో లెక్క. మన దేశానికి ఆ దేశం నుంచి వచ్చే కొన్ని వస్తువులు ఆగిపోయే అవకాశముంది. దీంతో ఆ వస్తువుల ధరలు భగ్గుమనే ఛాన్స్ ఉంది. With the Taliban occupation our pockets are empty{#}Petrol;gulf countries;war;India;Minister;American Samoa;Capital;Government;mediaతాలిబన్ల ఆక్రమణతో మన జేబులకు చిల్లు..!తాలిబన్ల ఆక్రమణతో మన జేబులకు చిల్లు..!With the Taliban occupation our pockets are empty{#}Petrol;gulf countries;war;India;Minister;American Samoa;Capital;Government;mediaMon, 16 Aug 2021 12:30:00 GMTమన దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. సెంచరీ దాటేసి పరుగులు పెడుతున్నాయి. వాహనదారుడు జేబులకు చిల్లులు పడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చే పెట్రోల్ సరఫరా కొంత వరకు ఆగిపోయే ప్రమాదముంది. దీంతో రేట్లు మరింత పెరిగే అవకాశముంది. అంతేకాదు కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు సైతం రాకపోవచ్చు.

ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. భారత్ పై ధరల ప్రభావం పడనుంది.  ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న వివిధ వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. ఆప్ఘనిస్థాన్ నుంచి అనేక రకాల డ్రైఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం వాటి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. జీలకర్ర, ఇంగువ, కొన్ని రకాల మందులు, మూలికల దిగుమతి ఆగిపోయే అవకాశముంది. తాలిబన్ల వల్ల గల్ఫ్ దేశాల్లో అస్థిరత ఏర్పడితే పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయి.

ఇప్పటికే దేశాన్నంతా ఆక్రమించేసిన తాలిబన్లు తాజాగా ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోకి చొచ్చుకొచ్చారు. దీంతో తమ యుద్ధం ముగిసిందనీ.. వారు ప్రకటించారు. ప్రస్తుతం శాంతియుత అధికార మార్పిడికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. దేశాన్ని విడిచి తాష్కెంట్ కు పారిపోయినట్టు ఆల్ బజీరా మీడియా సంస్థ పేర్కొంది. తాను రక్తపాతాన్ని తగ్గించేందుకే దేశాన్ని వీడుతున్నట్టు ఘనీ ప్రకటించారు.

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు ఆ  దేశ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. తాలిబన్లు అన్ని వైపులా చుట్టుముట్టడంతో అధికార మార్పిడి జరిగిపోయింది. అయితే దాడులు ఇక ఆపాలని ఆప్ఘాన్ అధ్యక్షుడుతో పాటు మంత్రులు తాలిబన్లను కోరారు. ఆర్థిక మంత్రి కూడా పరారీలో ఉన్నారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన మన దేశానికి మరో ఇబ్బంది తలెత్తేలా ఉంది. ఆప్ఘనిస్థాన్ తాలిబన్లు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది.





హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>