PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/breathtaking-news-about-the-corona9aaf2443-1855-4811-91ab-f772a002e216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/breathtaking-news-about-the-corona9aaf2443-1855-4811-91ab-f772a002e216-415x250-IndiaHerald.jpgభారతీయులకు ఉపశమనం కలిగించే వార్త. ఇన్నాళ్లూ పట్టిపీడించిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తోంది. వ్యాప్తి రోజురోజుకూ తగ్గుతూ పోతోంది. తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు.. మరణాల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. అటు పలు రాష్ట్రాలు సైతం కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. Breathtaking news about the corona{#}Andhra Pradesh;Australia;Bari;Capital;Government;local language;Coronavirusకరోనా విషయంలో ఊపిరి పీల్చుకునే వార్త..!కరోనా విషయంలో ఊపిరి పీల్చుకునే వార్త..!Breathtaking news about the corona{#}Andhra Pradesh;Australia;Bari;Capital;Government;local language;CoronavirusMon, 16 Aug 2021 11:34:41 GMTభారత్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 33వేల 937మంది కరోనా బారినపడ్డారు. మరో 417మంది కరోనా కారణంగా చనిపోయారు. ఫలితంగా దేశంలో కోరనా బాధితుల సంఖ్య 3కోట్ల 22లక్షల 25వేల 513కు పెరిగింది.  మొత్తంగా 4లక్షల 31వేల 642మంది చనిపోయారు. కొత్తగా 35వేల 909మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 3కోట్ల 14లక్షల 11వేల 924కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 81వేల 947 యాక్టివ్ కేసులున్నాయి.  

ఇక తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 50వేల  126మందికి పరీక్షలు చేయగా.. 245మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. తాజాగా ఒకరు కోవిడ్ మహమ్మారి వల్ల చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేల 842కు చేరుకుంది. అటు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 52వేల 380గా ఉంది. వైరస్ బారి నుంచి మరో 582మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 7వేల 268యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,506 కరోనా కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనా మహమ్మారి వల్లమరో 16మంది చనిపోయినట్టు పేర్కొంది. అటు 1,835మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 17వేల 865యాక్టివ్ కేసులున్నాయి.

ఇక ఏపీలో కరోనా కర్ఫ్యూ మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉన్న నైట్ కర్ఫ్యూని ఈ నెల 21వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు కరోనా డెల్టా వైరస్ ఆస్ట్రేలియాను వణికిస్తోంది. దీంతో స్థానిక ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన సిడ్నీలో బయట కనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. 8వారాల పాటు సిడ్నీలో లాక్ డౌన్ పెట్టినా .. కోవిడ్ వ్యాప్తి తగ్గట్లేదు. రాజధాని కాన్ బెర్రాలోనూ వైరస్ ను కట్టడి చేయలేకపోతున్నారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు.



ఫ్రీ పెట్రోల్.. తిరంగ యాత్రలో తొక్కిసలాట?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>