• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral Video: ఆఫ్గన్‌లో పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందంటే... ఈ చిన్నారి మాటలు వినండి

|

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కుకుపోవడంతో అక్కడి 4 కోట్ల ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. తాలిబన్ల తుపాకుల నీడన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజల ఆస్తులకు,ప్రాణాలకు రక్షణ ఉంటుందని తాలిబన్లు ప్రకటించినప్పటికీ... గత చేదు అనుభవాల రీత్యా ఆ మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించట్లేదు. అవకాశం దొరికితే దేశం వదిలి పారిపోవాలన్నదే ఇప్పుడు కోట్లాది మంది ఆఫ్గన్ల మదిలో మెదులుతున్న ఆలోచన. ప్రపంచమంతా చోద్యం చూస్తున్న వేళ అత్యంత నిస్సహాయ స్థితిలో,ధీనమైన పరిస్థితుల్లో.. బతుకుపై,భవిష్యత్తుపై వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ఆఫ్గన్‌లో పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందో చెప్పేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇరాన్ జర్నలిస్ట్,సామాజిక కార్యకర్త మసిహ్ అలినెజాద్ గత శుక్రవారం ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ఓ చిన్నారి మాట్లాడుతూ...'ఇక ఎన్ని రోజులనేది మేము లెక్కించము.ఎందుకంటే మేము ఆఫ్గనిస్తాన్‌లో పుట్టాం.ఇక ఏడవడం కూడా నావల్ల కాదు.ఈ వీడియోను చిత్రీకరించాలంటే నా కన్నీళ్లు తుడుచుకోవాలి.మా గురించి ఎవరూ పట్టించుకోరు.చరిత్రలో మేం నెమ్మదిగా మరణిస్తాం.' అని పేర్కొంది. పొంగుకొస్తున్న దు:ఖాన్ని అణచివేసుకుంటూ ఆ చిన్నారి ఈ వీడియోను చిత్రీకరించింది.

afghanistan heart wrenching viral video of a girl as taliban take over country

జర్నలిస్ట్ మసిహ్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసి.. ఆఫ్గన్ విషయంలో ప్రపంచం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. 'తాలిబన్లు పట్టు బిగించడంతో భవిష్యత్ అంధకారంగా మారిన వేళ.. ఓ ఆఫ్గన్ చిన్నారి కన్నీటిపర్యంతమవుతోంది. ఆఫ్గన్ మహిళల పరిస్థితిని తలుచుకుంటే నా గుండె ముక్కలవుతోంది.వారిని కాపాడటంలో ప్రపంచం విఫలమైంది.చరిత్ర తప్పకుండా దీన్ని రాస్తుంది.' అని పేర్కొన్నారు.

ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితికి సంబంధించి చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సోమవారం(ఆగస్టు 16) వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. విమానంలో ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఆఖరికి ప్రమాదకరంగా విమానం రెక్కలపై సైతం జనం ఎక్కుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు కింద పడి చనిపోయారు. రిస్క్ చేసైనా సరే దేశాన్ని వీడాలనే యోచనలో ఆఫ్గన్లు ఉండటమే దీనికి కారణం.

ఆదివారం(ఆగస్టు 16) తాలిబన్లు కాబూల్ నగరాన్ని ఆక్రమించడంతో ఆఫ్గనిస్తాన్ దురాక్రమణ పూర్తయింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ రాజ్య స్థాపన చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ ఇక అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించి దేశాన్ని వీడి పారిపోయారు. తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ ఆఫ్గన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

English summary
A video that is currently going viral on social media is an example of how heartbreaking situation is in Afghanistan. Iranian journalist and social activist Masih Alinezad shared this video on his Twitter account last Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X