MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhimla-nayak-pawan-kalyan-rana54429c63-9e84-467c-92c2-269b0754b9e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhimla-nayak-pawan-kalyan-rana54429c63-9e84-467c-92c2-269b0754b9e9-415x250-IndiaHerald.jpgఆ సినిమాలో రానా , సాగర్ లకు సంబంధం ఉన్నట్టా లేనట్టా..? ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఎప్పుడైతే భీమ్లానాయ‌క్ టైటిల్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌లైందో అప్ప‌టి నుంచి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. 'లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవపడే.. ఒడిసిపట్టు.. దంచికొట్టు' అంటూ వచ్చిన ఈ వీడియోను చూసిన అభిమానుల‌కు భూమి మీద కాలు నిల‌వకుండా చేస్తోంది. గళ్ళ లుంగీ పైకి కట్టుకుంటూ కోపంతో 'హే డానీ.. బయటికి రారా నా.. కొ*కా..' అంటూ చెప్పిన వ‌వ‌న్ డైలbhimla nayak, pawan kalyan, rana{#}rana daggubati;kalyan;media;Mass;you tube;Hero;Remake;Biju Menon;Traffic police;Telugu;Cinema;producerఆ సినిమాలో రానా , సాగర్ లకు సంబంధం ఉన్నట్టా లేనట్టా..?ఆ సినిమాలో రానా , సాగర్ లకు సంబంధం ఉన్నట్టా లేనట్టా..?bhimla nayak, pawan kalyan, rana{#}rana daggubati;kalyan;media;Mass;you tube;Hero;Remake;Biju Menon;Traffic police;Telugu;Cinema;producerMon, 16 Aug 2021 13:30:00 GMTకళ్యాణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఎప్పుడైతే భీమ్లానాయ‌క్ టైటిల్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌లైందో అప్ప‌టి నుంచి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. 'లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవపడే.. ఒడిసిపట్టు.. దంచికొట్టు' అంటూ వచ్చిన ఈ వీడియోను చూసిన అభిమానుల‌కు భూమి మీద కాలు నిల‌వకుండా చేస్తోంది.

గళ్ళ లుంగీ పైకి కట్టుకుంటూ కోపంతో  'హే డానీ.. బయటికి రారా నా.. కొ*కా..' అంటూ చెప్పిన వ‌వ‌న్ డైలాగ్‌కు అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. పవన్ ను చాలా ఏండ్ల తరువాత ఊర మాస్ క్యారెక్ట‌ర్లో చూస్తున్న అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ''భీమ్లా నాయక్'' గ్లిమ్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేగాకుండా  యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో ట్రెండ్‌గా మారింది. ఇదంతా ఒక‌వైపు బాగానే ఉంది. కానీ అదే సమయంలో ఈ చిత్రంలో మరో హీరో రానా న‌టిస్తున్నాడు.  అయితే రానాను మేకర్స్ సైడ్ చేశారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మాతృకలో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేస్తుండ‌గా, పృథ్వీరాజ్ నటించిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా న‌టిస్తున్నాడు. మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రల పేర్లను టైటిల్ గా పెట్టారు. ఎందుకంటే ఇందులో ఇద్దరివీ స‌మాన ప్రాధాన్యత క‌లిగిన పాత్ర‌లు. నువ్వా నేనా అన్నట్లు కోన‌సాగుతాయి. కానీ తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి మల్టీస్టారర్ సినిమాగా కాకుండా, పవన్ కళ్యాణ్ సోలో మూవీగా మార్చేస్తున్నారని కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వస్తున్నాయి. ఇందులో పవన్ పోషిస్తున్న 'భీమ్లా నాయక్' పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడాన్ని బట్టే ఈ విషయం అర్థ‌మ‌వుతుంది.  రీమేక్ కాకపోయి ఉంటే పవన్ సినిమాలో రానా కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడ‌ని అనుకునేవారు. 'బాహుబలి' సినిమా తరహాలోనే ఇందులో రానా పాత్ర కూడా బ‌లంగా ఉంటుందని సర్దుకుపోయేవారు. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చారు. అప్పుడే తుది నిర్ణ‌యానికి రావొద్దని, ప్రతిదీ టైమ్ ప్రకారం వస్తుందని.. అప్పటి వరకు ఆగాల‌ని చెబుతున్నారు. దీనిని బట్టి త్వరలోనే రానా కు సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఏదేమైనా ఈ విషయంపై సోషల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది.


హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>