PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/carona413d9456-c360-4271-b20a-cee840de8844-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/carona413d9456-c360-4271-b20a-cee840de8844-415x250-IndiaHerald.jpgకొవిడ్ మహమ్మారి వల్ల మానువుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించాయి. మనిషి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఇక కరోనా వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయిగా, ఇంకొందరు బతకడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వడంతో అసంఘటిత రంగంలో బాధలు ఎక్కువయ్యాయ. ఈ క్రమంలోనే చాలా మంది బతకాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. కొవిడ్ వల్ల ప్రైవేటు ఉద్యోగులు వేతనాలు లేక ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చాలా మంది కుటుంబ పోషణ కోసం అప్పులు carona{#}suman;Sucide;Wife;Atmakur;sunil;police;Coronavirus;Kurnool;students;Schoolఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?carona{#}suman;Sucide;Wife;Atmakur;sunil;police;Coronavirus;Kurnool;students;SchoolMon, 16 Aug 2021 11:01:00 GMTకొవిడ్ మహమ్మారి వల్ల మానువుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించాయి. మనిషి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఇక కరోనా వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయిగా, ఇంకొందరు బతకడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వడంతో అసంఘటిత రంగంలో బాధలు ఎక్కువయ్యాయ. ఈ క్రమంలోనే చాలా మంది బతకాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. కొవిడ్ వల్ల ప్రైవేటు ఉద్యోగులు వేతనాలు లేక ఇబ్బందుల పాలయ్యారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చాలా మంది కుటుంబ పోషణ కోసం అప్పులు తీసుకొచ్చుకున్నారు. కాగా వాటిని తీర్చలేక ఆ బాధలు తాళలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని కోవెలకుంట్ల పట్టణానికి చెందిన కర్నాటి సుబ్రహ్మణ్యం, అతడి భార్య రోహిణి లైఫ్ ఎనర్జీ స్కూల్‌ను నడుపుతున్నారు. కరోనా కాలం నుంచి స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కూల్ కూడా ఆ మాదిరిగానే మూతపడే ఉన్నది. ఈ నేపథ్యంలోనే స్కూల్ ఫీజులు చెల్లించేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు వెనుకాడారు.

స్కూల్స్ కు విద్యార్థులు వెళ్లడం లేదు. కాబట్టి పీజులు ఎందుకు చెల్లించాలి? అనే భావనలో వారు డబ్బులు కట్టలేకపోయారు. ఈ క్రమంలోనే స్కూల్ నిర్వహణ, రెంట్ ఇతరాల కోసం డబ్బు అప్పుగా తీసుకొచ్చిన స్కూల్ యజమాని సుబ్రహ్మణ్యంపై అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వడ్డీ డబ్బులు మొదలుకుని అసలు వరకు ఎలా చెల్లించాలి? అనే ఆందోళన మొదలైంది. ఈ విషయమై కొద్ది రోజుల నుంచి మధనపడుతున్న సుబ్రహ్మణ్యం దంపతులు కారులో ప్రయాణించి ఆత్మకూరు సమీపంలోని కరివేమ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులు సూసైడ్‌తో కర్నూలు డిస్ట్రిక్ట్ ఒక్కసారిగా ఉల్కిపడింది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్లు దంపతులు సెల్ఫీ వీడియోలో తెలిపారు. తమ మరణానికి అప్పు ఇచ్చిన సుమన్ సింగ్, సునీల్ కుమార్ కారణమని, వారిరువురు తమను ఎన్నో సార్లు వేధించారని ఆరోపించారు దంపతులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ఫేస్ బుక్ పరిచయము... ఆ యువతి ప్రాణం తీసిందా..?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>