PoliticsR.PARMESWAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/congress030eb0a8-e28a-4721-a50c-d01840ee34b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/congress030eb0a8-e28a-4721-a50c-d01840ee34b4-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనే సామెతను హస్తం పార్టీ ఒంటబట్టించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2022లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని జనాలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రచార ఉద్యమాన్ని చేపట్టబోతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 గంటల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గడిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిందిcongress{#}Prime Minister;Assembly;Allu Sneha;Mohandas Karamchand Gandhi;Party75 గంటలు 75 జిల్లాలు, యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు75 గంటలు 75 జిల్లాలు, యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తుcongress{#}Prime Minister;Assembly;Allu Sneha;Mohandas Karamchand Gandhi;PartyMon, 16 Aug 2021 17:55:00 GMTఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనే సామెతను హస్తం పార్టీ ఒంటబట్టించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2022లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని జనాలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రచార ఉద్యమాన్ని చేపట్టబోతోంది.


స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 గంటల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గడిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ రూపొందించింది.  జై భారత్‌ మహాసంపర్క్‌ అభియాన్‌ పేరుతో చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభిస్తారు. పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రకటించింది.


దాదాపు 90 లక్షల మంది ప్రజలను నేరుగా కలిసేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 30 వేల గ్రామాల్లో 3 రోజులకు పైగా గడపనున్నారు. ఈ మూడు రోజుల్లో ప్రతీ రోజు ఒక గంట పాటు కాంగ్రెస్‌ నాయకులు శ్రమదానం  కూడా చేస్తారు. ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సద్భావన దివస్‌ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలు, వృద్ధులను సన్మానించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అంతే కాదు గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సహపంక్తి భోజనాలు కూడా చేస్తారు. దీనికి స్నేహ భోజనం అని పార్టీ శ్రేణులు నామకరణం చేశాయి.


వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్తోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, యూపీ కాంగ్రెస్‌ నేతలంటున్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట్ల కాంగ్రెస్‌ సిద్ధాంతం సర్వధర్మ సమభావాన్ని నమ్మేవారికి టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. మొత్తమ్మీద ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరిచినట్టు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలున్నాయి.




సినీ ప్రముఖులకు జగన్ పిలుపు... అసలు కథ ఇదేనా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - R.PARMESWAR]]>