SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lords-test23a52558-3cd4-4553-a71d-ab00f5caa1d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lords-test23a52558-3cd4-4553-a71d-ab00f5caa1d9-415x250-IndiaHerald.jpgలార్డ్స వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టు మ్యాచ్ లో విజయానికి కేవలం 157 పరుగుల దూరంలో టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చివరి రోజు ఆట అంతా కూడా వర్షార్పణం అయ్యింది. అసలు ఒక్క బంతి కూడా పడక పోవడంతో... మ్యాచ్ డ్రా గా డిక్లైర్ చేశారు ఎంపైర్లు. లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టుకు మాత్రం వరుణుడు ఎలాంటి ఆటంకాలు పెట్టలేదు. నాలుగు రోజుల ఆట సజావుగా సాగింది. ముందుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా... రాహుల్ సెంచరీ, రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ Lords{#}Rishabh Pant;rahul;Rahul Sipligunj;VIRAT KOHLI;Indiaలార్డ్స్ టెస్ట్ విజేత ఎవరో..?లార్డ్స్ టెస్ట్ విజేత ఎవరో..?Lords{#}Rishabh Pant;rahul;Rahul Sipligunj;VIRAT KOHLI;IndiaMon, 16 Aug 2021 06:51:00 GMTలార్డ్స వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టు మ్యాచ్ లో విజయానికి కేవలం 157 పరుగుల దూరంలో టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చివరి రోజు ఆట అంతా కూడా వర్షార్పణం అయ్యింది. అసలు ఒక్క బంతి కూడా పడక పోవడంతో... మ్యాచ్ డ్రా గా డిక్లైర్ చేశారు ఎంపైర్లు. లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టుకు మాత్రం వరుణుడు ఎలాంటి ఆటంకాలు పెట్టలేదు. నాలుగు రోజుల ఆట సజావుగా సాగింది. ముందుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా... రాహుల్ సెంచరీ, రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ తో 364 పరుగులు చేసింది. అయితే ఇంగ్లండ్ జట్టు కూడా ధీటుగానే జవాబిచ్చింది. కెప్టెన్ రూట్ 180 రన్స్ కు తోడు బెయిల్ స్టౌ, బర్న్ రాణించడంతో... ఫస్ట్ ఇన్నింగ్స్ లో 27 పరుగులు ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ సేన... ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయింది. పుజారా, రహానే పుణ్యమా అని స్కోరు బోర్డు మీద గౌరవ ప్రదమైన స్కోరు నమోదైంది. అయితే నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా... 181 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ మాత్రమే ఉన్నాడు. మిగిలిన నలుగురు కూడ ఇషాంత్, షమీ, బుమ్రా, సిరాజ్ బౌలర్లే కావడంతో... వికెట్లు తీయడం ఇంగ్లీష్ బౌలర్లకు పెద్ద ఇబ్బందేం కాకపోవచ్చు. ప్రస్తుతం కేవలం 154 పరుగుల ఆధిక్యంలో మాత్రమే కోహ్లీ సేన ఉంది.

ఓ రోజు అంతా ఆట మిగిలి ఉండటంతో... లంచ్ లోపు భారత్ ను ఆలౌట్ చేస్తే... అప్పుడు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లండ్ కు పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు భారత్ ముందున్నవి రెండో దార్లు... ఒకటి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటం... లేదా ఇంగ్లీష్ టీమ్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడం. మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలి. గెలవాలంటే మాత్రం ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి.. సాయంత్రంలోపు ఆలౌట్ చేయాలి. చివరి రోజు కావడంతో.. లార్డ్స టెస్ట్ లో ఫలితం తేలుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.





తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .. !

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>