MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sarkaruvari-pata-vs-puspaf2cf547b-fc6a-4e1c-967b-190f9135555f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sarkaruvari-pata-vs-puspaf2cf547b-fc6a-4e1c-967b-190f9135555f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కానున్న సినిమా గురించి అప్పుడే సందడి మొదలైపోయింది. కరోనా పుణ్యమా అని రెండు సంవత్సరాల నుండి పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ చేయకుండా కాచుకు కూర్చున్నాయి. ఇప్పుడు దొరికిన కాస్త సమయాన్ని దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటున్నారు.SARKARUVARI PATA VS PUSPA{#}chandra bose;chandrabose;prince;August;Subhas Chandra Bose;Varsham;sree;sukumar;mahesh babu;Audience;Allu Arjun;Mass;Coronavirus;Cinema;Tollywoodబ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?SARKARUVARI PATA VS PUSPA{#}chandra bose;chandrabose;prince;August;Subhas Chandra Bose;Varsham;sree;sukumar;mahesh babu;Audience;Allu Arjun;Mass;Coronavirus;Cinema;TollywoodMon, 16 Aug 2021 20:30:00 GMTటాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కానున్న సినిమా గురించి అప్పుడే సందడి మొదలైపోయింది. కరోనా పుణ్యమా అని రెండు సంవత్సరాల నుండి పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ చేయకుండా కాచుకు కూర్చున్నాయి. ఇప్పుడు దొరికిన కాస్త సమయాన్ని దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ 'పుష్ప' షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం. పుష్పలో మొదటి సాంగ్ రాకముందు వరకు ఒక రేంజ్ లో ఉన్న పుష్ప హైప్....ఈ పాట ఆలా వచ్చిందో లేదో, ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు డబుల్ అయ్యాయి. ఒక్క పాటతోనే టాలీవుడ్ ని జయించినంత పనిచేసింది చిత్ర బృందం.

ఈ పాటను రాసిన చంద్రబోస్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. ఎప్పుడూ ప్రయత్నించని ఒక కొత్త పంథాలో రాసిన పాట అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపచేస్తోంది. ఇక ఎప్పటి లాగే అద్భుతమైన బాణీలను అందించే దేవి శ్రీ ప్రసాద్ మరో సారి తన మ్యూజిక్ తో మాయను చేశాడు. ఇక ఈ పాట కోరియోగ్రఫీ మరియు బన్నీ నటన హైలైట్ అని చెప్పవచ్చు. ఒక్కపాటతోనే ఇన్ని మాయలు చేస్తే ఇక సినిమాలో ఎన్నెన్ని మాయాలున్నాయో అంతుబట్టడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా పుష్ప వైపే చూస్తోంది. ఆగష్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన 'సర్కారువారిపేట' టీజర్ కనీసం మహేష్ బాబు అభిమానవులను కూడా ఆకట్టుకోవడంలో విఫలమయింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ కి బ్రేకులు వేసేలా ఉందని ఇప్పటికే ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న మహేష్ కు నిరాశ తప్పేలా లేదని సినిమా వర్గాలు సైతం గుసగుసలాడుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో బన్నీ పుష్పను పోల్చాలంటే అస్సలు సరిపోదు. బన్నీ మూవీ నుండి విడుదలయిన పాట రేంజే లో కాదు కదా, దరిదాపుల్లో కూడా 'సర్కారువారుపాట' లేదని చెప్పాలి. ప్రయోగాత్మక కథలను చేయడంలో ఎప్పుడూ ముందునే ప్రిన్స్ మహేష్ ఈ సారి బొక్క ఆబొర్లా పడేలా ఉన్నాడని సినిమా క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఊహాగానాలు మాత్రమే సినిమా రిలీజ్ అయ్యాక ఏ సినిమా ఎలా ఉంది అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అప్పటివరకు వేచి చూడాల్సిందే.  



తాలిబన్లకు ఆ ఇద్దరు మద్దతుతో షాక్... ?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>