PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramya-murder5f05bd29-f639-496d-b399-ee75620e4cdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramya-murder5f05bd29-f639-496d-b399-ee75620e4cdd-415x250-IndiaHerald.jpgదేశమంతా స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. అందరిలో దేశభక్తి ఉప్పొంగి వాట్సప్ మెసేజ్ లు, స్టేటస్ ల రూపంలో పెల్లుబికింది. కానీ ఆ ఉత్సాహం కేవలం మాటలకే పరిమితం, చేతల్లో కాదు అనేది గుంటూరులో రుజువైంది. పట్టపగలు, నడిరోడ్డులో గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే అందరూ ఆ హత్యను చూసేవారే కానీ, వారించేవారే లేరని స్పష్టమైంది. ప్రజల్లో ఆ మాత్రం సామాజిక స్పృహ లేదు సరే, మరి ప్రభుత్వం ఏం చేస్తోంది. ramya murder{#}WhatsApp;Traffic police;central government;Capital;Yevaru;ramya;ramya krishnan;Murder.;Government;Jaganరమ్య హత్య.. విమర్శలను జగన్ తట్టుకోగలరా..?రమ్య హత్య.. విమర్శలను జగన్ తట్టుకోగలరా..?ramya murder{#}WhatsApp;Traffic police;central government;Capital;Yevaru;ramya;ramya krishnan;Murder.;Government;JaganMon, 16 Aug 2021 06:49:58 GMTదేశమంతా స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. అందరిలో దేశభక్తి ఉప్పొంగి వాట్సప్ మెసేజ్ లు, స్టేటస్ ల రూపంలో పెల్లుబికింది. కానీ ఆ ఉత్సాహం కేవలం మాటలకే పరిమితం, చేతల్లో కాదు అనేది గుంటూరులో రుజువైంది. పట్టపగలు, నడిరోడ్డులో గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే అందరూ ఆ హత్యను చూసేవారే కానీ, వారించేవారే లేరని స్పష్టమైంది. ప్రజల్లో ఆ మాత్రం సామాజిక స్పృహ లేదు సరే, మరి ప్రభుత్వం ఏం చేస్తోంది.

రమ్య ఉదంతం ఒక్కటే కాదు, ఇప్పటికే ఇలాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయి, జరుగుతున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన దిశ యాప్ తో నేరాల సంఖ్య తగ్గిపోయిందని ఓవైపు అధికారులు చెప్పుకుంటున్నారు. ఊరూ వాడా ఘనంగా దిశ యాప్ పై పబ్లిసిటీ చేస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లకు దిశ స్కూటీలు ఇచ్చి పహారా కాస్తున్నామని, ఎక్కడా ఎలాంటి దుర్ఘటన జరగదని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి గుంటూరులో జరిగిన దారుణాన్ని ఎవరి ఖాతాలో వేయాలి. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అది కూడా రాజధాని ప్రాంతంలోని ఓ భాగమేనని చెప్పుకోవాలి. మరి అలాంటి చోట కూడా పోలీస్ పహారా ఎందుకు లేదు. నడిరోడ్డులో అమ్మాయిని హత్య చేస్తుంటే ఎవరూ ఎందుకు అడ్డుకోలేదు.

ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మహిళల ప్రాణాలు కాపాడలేకపోతున్నారని, దిశ యాప్ పేరుతో కేవలం ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారని అంటున్నాయి. దిశ చట్టానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్రపడలేదని, అయినా ఏపీలో దిశ చట్టం అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శిస్తున్నాయి. ప్రతి విద్యార్థినికి సొంత మామయ్య జగన్ అని పదే పదే ప్రసంగాల్లో చెబుతుంటారు మంత్రులు. మరి మేనకోడలు దారుణంగా రోడ్డుపై హత్యకు గురైతే.. 10లక్షల నష్టపరిహారం ఆ కుటుంబ బాధను తీర్చగలుగుతుందా..? ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ బాధితులు కోరుకునేది ఒక్కటే, మాలాంటి అన్యాయం ఇంకే కుటుంబానికి జరక్కూడదు అని. కానీ ఎక్కడా ఏదీ ఆగలేదు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం ప్రభుత్వానికి చిటికెలో పని, కానీ ప్రజా పక్షం వేస్తున్న ప్రశ్నల్ని కూడా పరిగణిస్తేనే అధికార పక్షం అనే హోదా కొనసాగుతుంది. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో ప్రభుత్వం గుర్తించాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నిరోధించగలగాలి.





తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .. !

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>