PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan875a1aed-b4b1-43c4-9f00-de66c0433e41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan875a1aed-b4b1-43c4-9f00-de66c0433e41-415x250-IndiaHerald.jpgక‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఉప ఎన్నిక‌లు తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అటు అధికార టీఆర్ఎస్ ఇటు బీజేపీ సిద్ద‌మ‌వుతున్నాయి. త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతూ ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేకుంటున్నారు. గులాబీ బాస్ హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను ప్రెస్టెజ్‌గా తీసుకున్నారు. ఎలాగైనా హుజురాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగుర‌వేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. దీని కోసం ప్ర‌భుత్వం త‌ర‌ఫున పార్టీ త‌ర‌ఫున ఏది చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నారు. అనేpawan kalyan{#}KCR;Akkineni Nagarjuna;Car;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Telangana;Party;Bharatiya Janata Partyహుజురాబాద్ లో భీమ్లానాయ‌క్ ఎఫెక్ట్ ఉందా అస‌లు.?హుజురాబాద్ లో భీమ్లానాయ‌క్ ఎఫెక్ట్ ఉందా అస‌లు.?pawan kalyan{#}KCR;Akkineni Nagarjuna;Car;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Telangana;Party;Bharatiya Janata PartyMon, 16 Aug 2021 09:04:00 GMTహుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ ఉప ఎన్నిక‌లు తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అటు అధికార టీఆర్ఎస్ ఇటు బీజేపీ సిద్ద‌మ‌వుతున్నాయి. త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతూ ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేకుంటున్నారు. గులాబీ బాస్ హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను ప్రెస్టెజ్‌గా తీసుకున్నారు. ఎలాగైనా హుజురాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగుర‌వేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. దీని కోసం ప్ర‌భుత్వం త‌ర‌ఫున పార్టీ త‌ర‌ఫున ఏది చేయ‌డానికైనా సిద్దంగా ఉన్నారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో `ద‌ళిత బందు` ప‌థ‌కాన్ని ప్ర‌వేశపెట్టారు.

   అయితే, గ‌త 18 ఏండ్ల నుంచి త‌న‌కు హుజురాబాద్ గ‌డ్డ‌పై తిరుగు లేద‌నే విశ్వాసంతో ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నాడు. త‌న గెలుపు ఖాయం అనే ధిమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఒక వేళ హుజురాబాద్‌లో గులాబీ పార్టీ ఓట‌మి పాల‌యితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని కారు పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచ‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, కేసీఆర్ కు షాకివ్వాల‌నే ఆలోచ‌న‌లో ఈట‌ల ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని ప్రారంభించిన ఈట‌ల రాజేంద‌ర్‌. త్వ‌ర‌లోనే తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజ‌య్ కూడా పాద‌యాత్రకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు.

  ఈ నేప‌థ్యంలో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడు.? ఆయ‌న వ్యూహ‌మేంటి? ఎలా ముందుకు సాగుతారు ? అస‌లు బీజేపీకి ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ఇస్తాడా లేక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పీవీ కుమార్తెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్టు టీఆర్ఎస్ వెన్నుద‌న్నుగా ఉంటారా అనే ప్ర‌శ్న‌లు నెల‌కొంటున్నాయి. నిజానికి ప‌వ‌న్ ఏ ఎన్నిక‌ల్లోనూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు జ‌న‌సేనాని అవ‌స‌రం బీజేపీకి ఉంది ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ కాస్త బ‌ల‌హీన‌ప‌డిపోతుంది. అప్పుడు టీఆర్ఎస్‌ను ఎదిరించే బ‌ల‌మైన పార్టీగా తామేన‌ని చెప్పుకునేందుకు బీజేపీకి అవ‌కాశం ఉంటుంది.

 గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు అయిన దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీతో ప‌వ‌న్ చేతులు క‌ల‌ప‌లేదు. ఆ త‌రువాత జ‌రిగిన ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటి చేశాయి. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయో అర్థం కావ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తాడు ? అస‌లు జ‌న‌సేన స్టాండ్ ఏమిటి ?  బీజేపీకి స‌హ‌కారం అందిస్తాడా అనే విష‌యాలపై రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  మ‌రి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.


 





ప్రభాస్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందే..?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>