PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri-newsffbce854-d805-40f5-bb51-7453bf231d44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nri-newsffbce854-d805-40f5-bb51-7453bf231d44-415x250-IndiaHerald.jpgక‌రోనా మొద‌ల‌యిన నాటి నుంచి ప్ర‌పంచం మొత్తం ఆగ‌మాగం అయింది. అన్నిరంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అందులో భాగంగానే విద్యావ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అయింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌బ‌డ్డాయి. అయినా విద్యార్థులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని సూచించింది. దీంతో ఆయా పాఠ‌శాలల యాజ‌మాన్యం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు అంగీక‌రించాయి. నిర్వ‌హిస్తున్నాయి కూడా.. అయితే, ఈ ఆన్‌లైన్ క్లాసుల నెపంతో ఆయా విద్యాసంస్థ‌లు ఫీజుల వ‌సూలు చేయ‌డం మాత్రం ఆప‌లేదు. క‌రschools{#}students;media;Audio;Schoolస్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?schools{#}students;media;Audio;SchoolMon, 16 Aug 2021 10:29:00 GMT క‌రోనా మొద‌ల‌యిన నాటి నుంచి ప్ర‌పంచం మొత్తం ఆగ‌మాగం అయింది. అన్నిరంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అందులో భాగంగానే విద్యావ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అయింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌బ‌డ్డాయి. అయినా విద్యార్థులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని సూచించింది. దీంతో ఆయా పాఠ‌శాలల యాజ‌మాన్యం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు అంగీక‌రించాయి. నిర్వ‌హిస్తున్నాయి కూడా..

  అయితే, ఈ ఆన్‌లైన్ క్లాసుల నెపంతో ఆయా విద్యాసంస్థ‌లు ఫీజుల వ‌సూలు చేయ‌డం మాత్రం ఆప‌లేదు. క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోయి కొంద‌రు అర‌కొర జీతాల‌తో మ‌రికొంద‌రు త‌మ కుటుంబాల‌ను పోషించుకునే సంద‌ర్భంలో కార్పోరేట్ విద్యాసంస్థ‌లు వారిని వ‌దిలిపెట్ట‌లేవు. మాములు ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యం లాగే వారిని పూర్తి ఫీజులు క‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే విద్యార్థుల అడ్మిష‌న్ క్యాన్స‌ల్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు కూడా విద్యాసంస్థ‌లు విద్యార్థుల త‌ల్ల‌దండ్రుల దగ్గ‌ర 50 శాతం కంటే త‌క్కువ ఫీజులు తీసుకోవాల‌ని ఆదేశించింది.

 అయినా ఇవేం ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కార్పోరేట్ విద్యాసంస్థ‌ల య‌జ‌మానులు. పైగా స్కూల్ ఫిజు పూర్తిగా క‌ట్ట‌డంతో పాటు యూనిఫాం బిల్లులు, ఎగ్జామ్ ఫీజులు క‌ట్ట‌మ‌ని డిమాండ్ చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. వారి గ‌ల్లాపెట్టెలు నింపుకోవ‌డానికి క‌రోనాను వ్యాపారంగా మార్చుకున్నారు. అయితే, ఆ మాత్రం ఫీజులు వ‌సూలు చేసి వీళ్లు చెప్పింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.. రోజుకు రెండు గంటల సేపు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు మాత్ర‌మే నిర్వ‌హించాయి కొన్ని విద్యా సంస్థ‌లు.


  అయితే ఈ విధానంలో పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు బాగుప‌డ్డాయి. ఎలాగంటే పాఠ‌శాల భ‌వ‌నాల మెయింటనెన్స్ చార్జీలు, స్కూల్ బ‌స్సుల మెయింట‌నెన్స్‌, ఆయా పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు స‌గం ఇవ్వ‌డం లాంటివి. కానీ విద్యార్థులు ఏ విధంగాను లాభ‌ప‌డ‌లేద‌న్నది కొందరి అభిప్రాయం.  గ‌తంలో స్కూల్ ఫీజులు చెల్లించాల‌ని కొన్ని విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల‌ను వేధించిన విష‌యం తెలిసిందే. పైగా దానికి సంబంధించిన ఆడియో కాల్స్ టేపులు మీడియా ద్వారా విన్నాం కూడా. ఇదంతా చూస్తుంటే ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల ద్వారా బాగుప‌డింది ఆయా పాఠ‌శాల‌ల యాజ‌మాన్యం త‌ప్ప విద్య‌ర్థులు కాద‌ని స్ప‌ష్టం అవుతోంది.








మమతా బెనర్జీ మీదున్న పగ ఈటెలను బలి చేస్తుందా...?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>