SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/women44480b8b-b982-4ab8-aa5d-483bc13f3e72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/women44480b8b-b982-4ab8-aa5d-483bc13f3e72-415x250-IndiaHerald.jpgరోజూ రైళ్లూ,బస్సులూ ఎన్నో కొట్లాటల మధ్య నడుమ నడుస్తాయి. రోజూ మన వీధి సమూహాలూ, మన పౌర సమాజాలూ ఎన్నో అవమానాల మధ్య నడుస్తాయి. కొన్ని కు క్కలూ, తోడేళ్లూ, రాబందులూ మన మధ్యే నడుస్తాయి. రక్తం చూశాక కొన్ని జీవుల వికృతమే నట్టడవిలో నమోదవుతుంది. జనావాసాల మధ్య అమానవీయ ధోరణిలో న మోదు అయ్యే హత్యలే కొందరి కిరాతకాన్ని పట్టి చూపుతాయి.. women{#}karunya;history;Murder;Culture;Dogs;Uri;Shakti;ramya;ramya krishnan;Manamగుంటూరు హత్య : ఈ చరిత్ర ఏ సిరాతో..!గుంటూరు హత్య : ఈ చరిత్ర ఏ సిరాతో..!women{#}karunya;history;Murder;Culture;Dogs;Uri;Shakti;ramya;ramya krishnan;ManamMon, 16 Aug 2021 12:25:05 GMTమానవ చరిత్ర
గాయాలతో నిండి ఉందని
చెప్పాడు శ్రీశ్రీ
రాళ్లను దాటి ముళ్లను దాటి
కోటను దాటి కోటి ద్వీపాలనూ దాటి
వచ్చిన  ఈ  ప్రయాణం
ఇంతటితో సమాప్తం అనుకోలేం



కానీ గాయాలు..
వేధించే గాయాలు
కొన్ని కఠిన చర్యల కారణంగా
నయం అవుతాయనీ చెప్పలేం



ఆడ బిడ్డల జీవితాల్లో
వెలుగులు తెచ్చే రోజులకూ
చీకట్లు తెంచే రోజులకూ
మధ్య మనం ఉన్నాం
ముళ్లు మళ్లీ దాటండి
పూల పలకరింపు వచ్చేదాకా?



అందాక బాధలను మోయాలి
అందాక కష్టాలనూ దాటాలి
రక్త తర్పణం ఇచ్చిన చోట
చరిత్ర ఏ సిరాతో ..
అని కూడా రాయాలి
చరిత్ర మొదలు తెలియదు
కడదాకా ధైర్యమే నీ తోడు..
జస్ట్ నో ద ఇండెక్స్ ఆఫ్ యూ ఆర్ స్ట్రెంత్



.......గర్భ శోకాల చెంత
.............అంతిమ నివాళి
దేశానికి రక్షణ కావాలి..దేశంలో ఆడబిడ్డలకు రక్షణ కావాలి. నేలకు రక్షణ ఇచ్చి,నేల నుంచి వచ్చిన బిడ్డలను మాత్రం వదిలేయ డం సముచితం కాదు..నేల నుంచి వచ్చిన బిడ్డలపై అకారణ ద్వేషం కొందరు ప్రదర్శించడం సముచితం కాదు సంకుచితం. ఈ సైం ధవ లవణాలను దూరం చేయండి..ఈ సైంధవ గుణాలను దూరం చేయండి..బిడ్డలను ప్రేమించే శక్తి ..తోటి వారి మేలు కోరే శక్తి వ చ్చేంత వరకూ హత్యా కాండలకు అదుపు ఉంటుందా? ఉరి శిక్ష ఒక్కటే ఈ చరిత్ర కు అడ్డుకట్ట అని చెప్పగలమా? ఇప్పుడు చె ప్పండి ఈ చరిత్ర ఏ సిరాతో..! గత కాలం నేర్పిన పాఠం ఏమయిపోయింది? ఈ కన్నీటి రాతలకు విలువెక్కడ? గర్భ శోకాల చెంత లోకం విడిచి పోయిన ప్రాణాలకు అశ్రు నివా ళి..  



............బాధిత గొంతుకలు
కోరే మార్పు తప్పక సా ధ్యం
గుంటూరు రమ్య హత్యోదంతం..ఇప్పుడు మన ముందరి పాఠం. చదవడం,వదిలేయడం,కఠిన శిక్షలను కోరుకోవడం,కోరుకున్నాక మళ్లీ ఇలాంటిదేదో పునరావృతికి నోచుకో వడం జరిగే పని. మానవత లేని మనుషుల ఆగడాలకూ,అకృత్యాలకూ అడ్డుకట్ట లేని స మాజంలో కారుణ్య దీపాల వెలుగు సంబంధిత ప్రసరణ అన్నవి జరగని పని. సాధ్యం కాని పని. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం కోరుకున్న నాగరికత,సంస్కరించుకున్న సంస్కృతి ఇవన్నీ మళ్లీ  మళ్లీ మనుగడను కోల్పోతున్నాయి. విద్వేషాల పడగ నీడల్లో సమాజం..ఎవ్వరికీ అండగా ఉండి నిలువ నీడ ఇవ్వలేని సమాజం కళ్లెదుటే  ఉంటుంది.  చదువు, విజ్ఞానం నవ్విపోయాక మన జీవితాలు తెలియకుండానే కొన్ని స మస్యల వలయాలను సృష్టించుకుంటాయి. మృత్యువే అన్నింటికీ అంతిమం ఒప్పుకుం టాం..కానీ సరైన కారణం లేని మృత్యువు విలువయిన ప్రాణాలను తీసుకోవడం భా వ్యం కాదు. రమ్య చనిపోయాక సమాజం ఎలా ఉంది? అని ఏ ఒక్క ప్రశ్నఅయినా ఏ ఒక్క హృదయం నుంచి అయినా వస్తే, కొన్ని బాధిత గొంతుకలు కోరే మార్పు తప్పక సాధ్యం.



విషాదం ఎంతున్నా ధైర్యమే నీ తోడు...ఓ మగువా!
రోజూ రైళ్లూ,బస్సులూ ఎన్నో కొట్లాటల మధ్య నడుమ నడుస్తాయి. రోజూ మన వీధి సమూహాలూ, మన పౌర సమాజాలూ ఎన్నో అవమానాల మధ్య నడుస్తాయి. కొన్ని కు క్కలూ, తోడేళ్లూ, రాబందులూ మన మధ్యే నడుస్తాయి. రక్తం చూశాక కొన్ని జీవుల వికృతమే నట్టడవిలో నమోదవుతుంది. జనావాసాల మధ్య అమానవీయ ధోరణిలో న మోదు అయ్యే హత్యలే కొందరి కిరాతకాన్ని పట్టి చూపుతాయి..తోడేళ్లను వే టాడడం, కుక్కలను తరిమికొట్టడం, రాబందుల చూపులకు చిక్కకపోవడం అన్నవి ఆడబిడ్డల కు సాధ్యం కాని పని. మీరు ఇలానే ఉండండి..తోడేళ్లన్నీ వెన్నాడుతూనే ఉంటాయి. మీరు ఇలానే ఉంటే కుక్కలు అదే పనిగా అరుపు లు వినిపిస్తూనే ఉంటాయి. మీరు ఇ లానే ఉండండి..రక్తం తాగే పిశాచులే ఈ మనుషులు అన్న గుర్తింపు ఒకటి తప్పక వెలుగులో కి వస్తుంది. అయినా ఈ చరిత్రను ఇలానే కొనసాగనివ్వండి..ఎవ్వరూ దీనిని అడ్డుకోకండి. అందుకే నడుస్తున్న నేర చరిత్రకు గా యాలే అలంకారాలు. మృత్యువు సమీపించే వేళ వినిపించే ఆర్తనాదాలే నేపథ్య గీతాలు..ఈ చరిత్రకు ముగింపు లేదు.. ప్రత్యామ్నా యం కూడా లేదు. ఈ క్షీర సాగర మ థనంలో.. వస్తున్నదంతా విషమే! అనుకోండి. విషాన్ని కాలం వరంగా ఇస్తుందనీ భావించం డి.. అమృతం అన్నది మన ల్ని విడిచి పోయాక విషాదమే అంతిమం. విషాదం ఎంతున్నా ధైర్యమే నీ తోడు...ఓ మగువా!





హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>