MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/digital-platfram-ki-set-ayye-cimima-adenta71617d45-d8ba-4924-8aff-0388a4756abf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/digital-platfram-ki-set-ayye-cimima-adenta71617d45-d8ba-4924-8aff-0388a4756abf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి సినీ ప్రేక్షకులు సినిమాలను అక్కడ చూడొచ్చు. కానీ, కరోనా టైంలో టాకీసులు క్లోజ్ అయి ఉండగా, జనం ఇళ్లలోనే ఉండిపోయారు. మొత్తంగా వారికి వినోదం అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలు పుట్టుకొచ్చాయి. డిఫరెంట్ కంటెంట్‌తో కూడిని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీస్‌లో దర్శనమివ్వగా, వాటికి జనాలు అలవాటు పడిపోయారు. బోల్డ్ కంటెంట్‌తో ఎక్కువ సినిమాలు వచ్చాయనే చెప్పొచ్చు. కాగా, గతవారం విడుదలైన ‘బ్రాందీ డైరీస్’కు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. digital {#}vijay sethupathi;Dalapathi;Joseph Vijay;Amazon;Chitram;Telugu;Audience;Coronavirus;Darsakudu;Pawan Kalyan;Director;Cinemaడిజిటల్ ప్లాట్ ఫారమ్‌కు సెట్ అయ్యే సినిమా అదేనా..?డిజిటల్ ప్లాట్ ఫారమ్‌కు సెట్ అయ్యే సినిమా అదేనా..?digital {#}vijay sethupathi;Dalapathi;Joseph Vijay;Amazon;Chitram;Telugu;Audience;Coronavirus;Darsakudu;Pawan Kalyan;Director;CinemaMon, 16 Aug 2021 15:00:00 GMTప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి సినీ ప్రేక్షకులు సినిమాలను అక్కడ చూడొచ్చు. కానీ, కరోనా టైంలో టాకీసులు క్లోజ్ అయి ఉండగా, జనం ఇళ్లలోనే ఉండిపోయారు. మొత్తంగా వారికి వినోదం అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలు పుట్టుకొచ్చాయి. డిఫరెంట్ కంటెంట్‌తో కూడిని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీస్‌లో దర్శనమివ్వగా, వాటికి జనాలు అలవాటు పడిపోయారు. బోల్డ్ కంటెంట్‌తో ఎక్కువ సినిమాలు వచ్చాయనే చెప్పొచ్చు. కాగా, గతవారం విడుదలైన ‘బ్రాందీ డైరీస్’కు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది.

 ఈ సినిమాలో నటించిన వారందరూ కొత్తవారే. కాగా, ఈ ఇండిపెండెంట్ సినిమా ద్వారా దర్శకుడు మంచి పాయింట్ చెప్పే ప్రయత్నం చేశాడు. ‘మద్యపానం హానికరం’ అనే మెసేజ్‌ను కమర్షియల్ వేలో తెలిపాడు. ఈ చిత్రం ద్వారా టాలెంటెడ్ యాక్టర్స్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. మౌత్ పబ్లిసిటీతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం. అయితే, చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత ఈ కంటెంట్ ఓటీటీ ప్లాట్ ఫారమ్‌కు తగిన కంటెంట్ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జనాలు థియేటర్స్‌కు వెళ్తున్నప్పటికీ కొవిడ్ భయాలయితే ఉండిపోయాయి. అలానే ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ‘ బ్రాందీ డైరీస్’ ఓటీటీలకు ఎలాగూ వచ్చే చాన్సెస్ ఉంటాయి.

అప్పుడు ఈ సినిమాకు మంచి వ్యూస్ లభించొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా సినిమాలకు ఓటీటీ బాట పట్టడానికి చాలా టైం అస్సలు పట్టడం లేదు. థియేటర్స్‌లో విడుదలైన కొద్ది రోజుల్లోనే దాదాపుగా నెలరోజులు కూడా కాకముందే కొన్నిపెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇళయ దళపతి విజయ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన ‘మాస్టర్’ ఫిల్మ్ థియేటర్‌లో విడుదలైన నెల రోజులలోపే ఓటీటీ బాట పట్టింది. అక్కడ కూడా సత్తా చాటింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా కూడా అంతే.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.



విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>