BusinessN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hostels-can-retrive0b0ce55c-6451-4780-b15f-be65a1db25a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/hostels-can-retrive0b0ce55c-6451-4780-b15f-be65a1db25a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా కంట్రోల్‌లో ఉంది. అయినా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఇప్పటికే ఏడాదికిపైగా మూతపడిన హాస్టళ్లను తెరవాలో వద్దో తెలియక నిర్వాహకులు డైలామాలో ఉన్నారు. కరోనా ఎంట్రీ తర్వాత హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు నడపడం కష్టంగా మారింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు, ఐటీ ఎంప్లాయీస్‌కు వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో హాస్టల్స్‌కు తాళాలు పడ్డాయి. దీంతో అద్దె, మెయింటెనెన్స్ కష్టమవుతోందని ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. గ్రేటర్ పరిధిలో 650 రిజిhostels can retrive{#}Coronavirus;Governmentహైదరాబాద్‌లో హాస్టళ్లకు మళ్లీ కళ వచ్చేనా?హైదరాబాద్‌లో హాస్టళ్లకు మళ్లీ కళ వచ్చేనా?hostels can retrive{#}Coronavirus;GovernmentMon, 16 Aug 2021 19:50:08 GMTప్రస్తుతం కరోనా కంట్రోల్‌లో ఉంది. అయినా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఇప్పటికే ఏడాదికిపైగా మూతపడిన హాస్టళ్లను తెరవాలో వద్దో తెలియక నిర్వాహకులు డైలామాలో ఉన్నారు. కరోనా ఎంట్రీ తర్వాత హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు నడపడం కష్టంగా మారింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు, ఐటీ ఎంప్లాయీస్‌కు వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో హాస్టల్స్‌కు తాళాలు పడ్డాయి. దీంతో అద్దె, మెయింటెనెన్స్ కష్టమవుతోందని ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. గ్రేటర్ పరిధిలో 650 రిజిస్టర్డ్ హాస్టల్స్ ఉన్నాయి. రిజిస్టర్ కానివి మరో 10వేలకుపైనే ఉన్నాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, మధురానగర్, ఎస్‌ఆర్‌ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, కొండాపూర్ వంటి  కమర్షియల్ ఏరియాల్లో ఎక్కువ సంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 శాతానికిపై హాస్టళ్లను నడపలేక నిర్వాహకులు ఎత్తేశారు. కొన్ని తాత్కలికంగా బంద్  అయ్యాయి.

అద్దె భవనంలో హాస్టళ్లను నిర్వహించేవారు కిరాయి కట్టలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ మందితో హాస్టల్స్‌ను నడపలేకపోతున్నారు.ప్రైవేట్ హాస్టల్, పెయిడ్ గెస్ట్ హోమ్‌ నడపాలంటే నెలకు ఏరియాను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకు అద్దె కట్టాల్సి ఉంటుంది. కమర్షియల్ ఏరియాల్లో  హాస్టళ్లను దృష్టిలో పెట్టుకునే నాలుగైదు అంతస్తుల బిల్డింగులను కడుతుంటారు. ఆయా ప్రాంతాల్లో అద్దెలు కూడా లక్షల్లో ఉంటాయి. ప్రైవేటు హాస్టల్లో ఉండేవారి నుంచి నిర్వా హకులు  నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఫీజుగా తీసుకుంటారు. కొవిడ్ ఎంట్రీ తర్వాత ప్రైవేటు హాస్టళ్ల పరిస్థితి తారుమారైంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్‌లో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు.

కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఐసోలేషన్ సెంటర్లుగా వాడుకునేందుకు కొందరు హాస్టళ్లను అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత అద్దెలు కట్టలేక ఓనర్లతో  నిర్వాహకులకు గొడవలు తప్పడం లేదు.  అద్దె కోసం యజమానులు ఒత్తిడి పెంచుతున్నారని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. అద్దె విషయంలో ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు . కరోనాకు ముందు ఒక్కో హాస్టల్‌లో 100 మందికి పైగానే ఉండేవారు. ప్రస్తుతం 20 నుంచి 30 మంది కూడా ఉండటం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ట్యాక్సుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.



తాలిబన్లకు ఆ ఇద్దరు మద్దతుతో షాక్... ?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>